ప్రముఖ కమెడియన్ ఆలీ మూడు దశాబ్దాల పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు. ఆలీది వైవిధ్యమైన జీవితం. ప్రతి ఒక్కస్టార్ హీరోతో చాలా సఖ్యతతో ఉంటాడు. ఎన్నో గొప్ప సినిమాల్లో ఎన్నో గొప్ప పాత్రల్లో నటించాడు. పెద్ద పెద్ద స్టార్ హీరోలకు కూడా ఆలీ అత్యంత ఆప్తుడు. ఇటు వ్యాఖ్యాతగా బుల్లితెర మీద కూడా విజృంభిస్తున్నాడు. ఇక ఆలీ స్వస్థలం ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి.
ఇటు వెండితెరమీద క్షణం తీరిక లేనంత బిజీగా ఉన్నా కూడా బుల్లితెరను కూడా మనోడు తన షోలతో షేక్ చేసి పడేస్తున్నాడు. ఆలీ పెళ్లి జరిగిన టైంలో చాలా బిజీగా ఉండేవాడట. ఇక ఆలీ పెళ్లి జరిగిన టైంలో మనోడు మరీ బిజీగా ఉండేవాడట. ఆలీ పెళ్లి ముద్దుల ప్రియుడు సినిమా షూటింగ్ టైంలో జరిగింది. ఆ సినిమాకు రాఘవేంద్రరావు దర్శకుడు. షూటింగ్ అన్నపూర్ణలో జరుగుతోంది.
ఆలీ పెళ్లి 1994 జనవరి 22న అయ్యింది. ఆ మరుసటి రోజు 23న రిసెప్షన్ పెట్టారు. ఇక 24నే ఆలీ తన భార్యతో పాటు తల్లిని తీసుకుని హైదరాబాద్ వచ్చేశాడట. ఆలీ అప్పట్లో అంత బిజీగా ఉండేవాడట. అప్పట్లో ఇప్పుడు ఉన్నంత సోషల్ మీడియా, గాసిప్‌లు లేవు. ఆలీ పెళ్లి చేసుకున్న రెండో రోజే షూటింగ్‌కు రావడంతో ఆలీ ఫస్ట్ నైట్ షూటింగ్ బ్రేక్‌లో జరిగిందని ఇండస్ట్రీలో ఆటపట్టించేవారట.
ఆలీకి స్పెషల్‌గా రాఘవేంద్రరావు గారు ఫస్ట్ నైట్ కోసం రెండు గంటల పాటు బ్రేక్ ఇచ్చి.. అది పూర్తయిన వెంటనే మళ్లీ షూటింగ్‌కు పిలిచారని సరదాగా జోకులు వేసుకునేవారట. అంటే ఆలీ అప్పట్లోనే ఎంత బిజీ ఆర్టిస్టో తెలుస్తోంది. ఇక రీసెంట్‌గా ఆలీ తన పెద్ద కుమార్తెకు కూడా పెళ్లి చేసేసి జీవితంలో మరో బాధ్యత కూడా నెరవేర్చేసుకున్నాడు.