నందమూరి బాలకృష్ణ హీరోగా డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ వీరసింహారెడ్డి. అఖండ లాంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత బాలయ్య నుంచి వచ్చిన సినిమా కావడంతో వీరసింహాపై ప్రి రిలీజ్ బజ్ మామూలుగా లేదు. అసలు వారం రోజులుగా ఏపీ, తెలంగాణ అంతటా జై బాలయ్య నామస్మరణతో మార్మోగిపోతోంది. సినిమాపై ఉన్న అంచనాలకు తగినట్టుగానే టాక్ కూడా అదిరిపోవడంతో వీరసింహాతో థియేటర్లు దద్దరిల్లుతున్నాయి.
ఫస్ట్ డే బాలయ్య కెరీర్లో రికార్డులు బ్రేక్ అయిపోవచ్చంటున్నారు. ఇక ఈ సినిమా హిట్ అవ్వాలని ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు సోషల్ మీడియాలో విషెస్ వెల్లువెత్తిస్తున్నారు. ఈ క్రమంలోనే మెగా హీరో సుప్రీం సాయి ధరమ్ తేజ్ సోషల్ మీడియా ద్వారా వీరసింహారెడ్డి టీంకు, బాలయ్యకు తన బెస్ట్ విషెస్ చెప్పాడు.
ఈ పండగ సీజన్‌ను తెలుగు సినిమాకు నందమూరి బాలకృష్ణ గారి వీరసింహారెడ్డితో గ్రేట్‌గా స్టార్ట్ చేయబోతున్నారంటూ సాయి తేజ్ చెప్పాడు. ఇక డైరెక్టర్ గోపీచంద్‌తో పాటు మ్యూజిక్ డైరెక్టర్ థమన్‌తో పాటు టీం అందరికి కూడా బెస్ట్ విషెస్ చెప్పాడు. అయితే సాయిధరమ్ మెగా కాంపౌండ్ హీరో అయినా కూడా ఆ ఫీలింగ్ అస్సలు చూపించడు. ఇండస్ట్రీలో అన్ని వర్గాల హీరోలతోనూ సత్సంబంధాలు మెయింటైన్ చేస్తూ ఉంటాడు.
ముఖ్యంగా బాలయ్య సినిమాల విషయంలోనూ, బాలయ్య విషయంలోనూ ఎప్పటికప్పుడు తన ప్రత్యేక అభిమానం చాటుకుంటూనే వస్తున్నాడు. అఖండ సినిమా సూపర్ హిట్ అవ్వాలని అప్పట్లో సోషల్ మీడియాలో ముందే విష్ చేశాడు. ఆ తర్వాత సాయితేజ్ అంటే నందమూరి అభిమానులు కూడా ప్రత్యేక అభిమానం చూపుతూ వచ్చారు. సాయితేజ్ యాక్సిడెంట్లో గాయపడినప్పుడు బాలయ్య అభిమానులు కూడా సాయి త్వరగా కోలుకుని మళ్లీ సినిమాల్లోకి రావాలని ఆకాంక్షించారు.
ఇక ఇప్పుడు మరోసారి సాయితేజ్ అటు తన మావయ్య వాల్తేరు వీరయ్య సినిమాకు బాలయ్య వీరసింహా పోటీగా వస్తున్నా కూడా బాలయ్య సినిమా హిట్ అవ్వాలని కోరుకోవడంతో సాయితేజ్‌కు బాలయ్యపై మంచి అభిమానం ఉందన్న కామెంట్లు పడుతున్నాయి.