Moviesషో పడ‌కుండానే క‌లెక్ష‌న్ల‌లో దుమ్ము రేపిన బాల‌య్య‌... బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోన్న...

షో పడ‌కుండానే క‌లెక్ష‌న్ల‌లో దుమ్ము రేపిన బాల‌య్య‌… బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోన్న వీర‌సింహా వసూళ్లు..!

న‌ట‌సింహం నందమూరి బాలకృష్ణ, శృతిహాసన్ జంటగా నటించిన వీరసింహా రెడ్డి ఈ రోజు ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అయ్యింది. గ‌త రాత్రి నుంచే ఓవ‌ర్సీస్‌లో ప్రీమియ‌ర్ షోలు ప‌డిపోయాయి. ఓవ‌ర్సీస్‌లో అయితే ప్రీమియ‌ర్ల హంగామా మామూలుగా జ‌ర‌గ‌లేదు. ఇటు ఏపీ, తెలంగాణ‌లో ప‌లు చోట్ల తెల్ల‌వారు ఝామున 4 గంట‌ల నుంచే బెనిఫిట్ షోలు ప‌డిపోయాయి.

అర్ధ‌రాత్రి నుంచే మెలుకువ‌గా ఉన్న బాల‌య్య అభిమానులు థియేట‌ర్ల ద‌గ్గ‌ర చేసిన ర‌చ్చ అయితే అంతా ఇంతా కాదు. ఇటు హీరో బాల‌య్య అఖండ లాంటి హిట్‌తో.. అటు ద‌ర్శ‌కుడు గోపీచంద్ మ‌లినేని క్రాక్ హిట్‌తో ఫామ్‌లో ఉండ‌డం.. ఇప్పుడు వీరిద్ద‌రి కాంబోలో సినిమా వ‌స్తుండ‌డంతో వీర‌సింహారెడ్డిపై భారీ బ‌జ్ నెల‌కొంది.

అయితే ఈ సినిమా షో ప‌డ‌కుండానే ఓవ‌ర్సీస్‌లో అరుదైన మైలురాయికి చేరుకుంది. ఇప్ప‌టికే యూఎస్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ప్రీ సేల్స్‌తోనే హాఫ్ మిలియన్ మార్క్ టచ్ చేసింది. బాల‌య్య సినిమాల‌కు ఓవ‌ర్సీస్‌లో అఖండ‌కు ముందు మిలియ‌న్ డాల‌ర్లు వ‌స్తేనే గొప్ప‌.. ఇటీవ‌ల కాలంలో గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి మాత్ర‌మే అక్క‌డ 2 మిలియ‌న్ డాల‌ర్లు ట‌చ్ చేసింది. ఇక అఖండ కూడా అక్క‌డ అద‌ర‌గొట్టేసింది.

ఇప్పుడు వీర‌సింహాకు షో ప‌డ‌కుండానే హాఫ్ మిలియ‌న్ డాల‌ర్ల వ‌సూళ్లు వ‌చ్చాయి. బుధ‌వారం రాత్రి నుంచే యూఎస్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర నంద‌మూరి, బాల‌య్య అభిమానులు క్యూ క‌ట్టి మ‌రీ సినిమాను ఎంజాయ్ చేశారు. మ‌రి రాబోయే రోజుల్లో వీర‌సింహా యూఎస్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో ? చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news