అర్చన.. నేటి తరానికి పెద్దగా తెలియని పేరు. కానీ, మంచి నటులకు ఉండాల్సిన అన్ని లక్షణాలు పుష్కలంగా పుణికి పుచ్చుకు న్న నటీమణి. రెండు దశాబ్దాల పాటు తెలుగు, తమిళ, మలయాళ సినీ రంగంలో పనిచేసినా.. తెలుగు లో మాత్రం ఆమెకు ఎన్నదగినపేరు రాలేదు. `నిరీక్షణ` తెలుగు సినిమా.. బ్లాక్ బస్టర్‌గా ఆమె కెరీర్లో నిలిచిపోయింది. భాను చందర్ హీరోగా, ఆమె హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా వంద రోజులు ఆడింది.
అయితే.. అనుకున్న విధంగా ఆమె పేరు మార్మోగలేదు. అంతేకాదు.. లేడీస్ టైలర్‌లోనూ.. ఆమె పోషించిన టీచర్ పాత్ర అద్భుతః..! అయినా..కూడా తెలుగులో అర్చన అంటే.. నేటి రోజుల్లో తడుము కోవాల్సిన దుస్థితి!! నిజానికి ఏ కేరక్టర్ అయినా.. ఒదిగిపోయే లక్షణం ఉన్న నటి అర్చన. అప్పట్లో ఓపెన్ టాప్ గా నటించి.. యువతను ఉర్రూతలూగించింది.
అంతేకాదు.. సూటిగా, స్పష్టంగా డైలాగ్ డెలివరీ వంటివాటిలో నెంబర్ 1గా పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా భారతీరాజా అర్చనను ఎక్కువగా ప్రోత్సహించారు. తర్వాత బాల చందర్ సినిమాల్లోనూ నటించారు. అయితే.. తెలుగులో ఆమెను తీర్చిదిద్దిన దర్శకుడు ఎవరూ కనిపించలేదు. సంచలన దర్శకుడు వంశీ ఆమె టాలెంట్ బయట పెట్టేందుకు కొంత వరకు ప్రయత్నించారు.
ఆయన రూపొందించిన సినిమాల్లో అవకాశం ఎక్కువగానే ఇచ్చారు. అయినప్పటికీ.. ఇతర దర్శకుల నుంచి పెద్దగా ప్రోత్సాహం లభించలేదు. దీంతో అర్చన వంటి తెలుగు సినిమాల్లో పెద్దగా రాణించలేకపోయారు. ఆమె నటించిన సినిమాలు కొన్నే అయినా..సూపర్ హిట్లు కొట్టాయి. అర్చన రెండు సార్లు జాతీయ ఉత్తమనటి పురస్కారాన్ని పొందారు.
తెలుగు, తమిళ చిత్రాలకు 1989లో, 1988లో జాతీయ ఉత్తమ నటి పురస్కారాన్ని సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగానే కొనసాగుతున్న అర్చన.. తెలుగు సినీ రంగంలో తనకంటూ కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు.