సహజనటి జయసుధ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. గత నాలుగు దశాబ్దాలకు పైగా ఆమె తెలుగు ప్రేక్షకులను తన నటనతో మెప్పిస్తూనే ఉంది. ఇప్పుడు వయస్సు పై బడడంతో ఆమె మన హీరోలకు అమ్మ, అక్క పాత్రల్లో నటిస్తోంది. 1980ల్లో ఆమె తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగింది. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్‌బాబు లాంటి హీరోలతో నటించి ఎన్నో సూపర్ హిట్లు కొట్టారు.
లేడీ ఫ్యాన్స్‌లోనూ, మహిళా ఫ్యాన్స్‌లోనూ జయసుధకు ఇప్పటకీ చెక్కు చెదరని ఇమేజ్ ఉంది. తాజాగా వచ్చిన విజయ్ వారసుడు సినిమాతోనూ ఆమె ప్రేక్షకులను పలకరించారు. అయితే ప్రస్తుతం జయసుధ ఓ వ్యక్తితో సన్నిహితంగా ఉంటున్నారని.. ఆమె మూడో పెళ్లికి రెడీ అవుతున్నారంటూ ఒక్కటే వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇటీవల ఏ ఈవెంట్ జరిగినా కూడా సదరు వ్యక్తి జయసుధతో ఉంటున్నారు.
ఇటీవల జరిగిన కమెడియన్ ఆలీ కుమార్తె పెళ్లికి కూడా జయసుధ సదరు వ్యక్తితోనే వచ్చారు. దీంతో అతడిని జయసుధ మూడో పెళ్లి చేసుకోబోతున్నారంటూ ఒక్కటే ప్రచారం జరిగింది. ఈ వార్తల సంగతి ఇలా ఉంటే జయసుధకు గతంలోనే రెండు పెళ్లిళ్లు అయ్యాయి. ముందుగా కృష్ణా జిల్లాకు చెందిన పారిశ్రామికవేత్త కాకర్ల రాజేంద్రప్రసాద్‌తో ఆమెకు తొలి పెళ్లి జరిగింది.
అయితే అతడు పెట్టే టార్చర్ భరించలేక ఆమె విడాకులు తీసుకున్నారు. అప్పట్లో ఈ పెళ్లికి దాసరి నారాయణరావు లాంటి పెద్దలు కూడా హాజరయ్యారు. ఆ తర్వాత బాలీవుడ్ స్టార్ హీరో జితేంద్ర కపూర్ కజిన్ నితిన్ కపూర్‌ను పెళ్లాడారు. నితిన్ అనారోగ్యంతో నాలుగేళ్ల క్రితం మృతి చెందారు. ఇక జయసుధ తన కుమారుడిని కూడా హీరోగా పరిచయం చేశారు.
అయితే జయసుధకు సీనియర్ హీరో వడ్డే నవీన్ తండ్రి, దివంగత నిర్మాత వడ్డే రమేష్‌తో పెళ్లి జరిగిందని కొన్ని పుకార్లు బాగా వినిపించాయి. అయితే అవన్నీ అవాస్తవాలే. అప్పట్లో మీడియాలో ఈ పెళ్లి వార్తలు రావడంతో ఇది ఎప్పటకీ హాట్ పుకారుగానే నిలిచిపోయింది.