నటసింహం బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి సినిమా రిలీజ్‌కు మరో 10 రోజుల టైం మాత్రమే ఉంది. ఇప్పటికే థియేటర్లలో బాలయ్య ఎలాంటి రచ్చ చేస్తాడన్న ఉత్కంఠ, ఉత్సుకత మామూలుగా లేవు. అఖండ తర్వాత బాలయ్య క్రేజ్ రోజు రోజుకు ఎలా ? పెరిగిపోతుందో చూస్తూనే ఉన్నాం. ఇక వీరసింహారెడ్డి ప్రి రిలీజ్ బిజినెస్‌లో బాలయ్య కెరీర్‌లోనే హయ్యస్ట్ ప్రి రిలీజ్ బిజినెస్ జరిగిన సినిమాగా రికార్డులకు ఎక్కేసింది.
బాలయ్యకు కలిసొచ్చిన సింహా, రెడ్డి పదాలు కూడా సినిమా టైటిల్స్‌లో ఉన్నాయి. అలాగే రాయలసీమ బ్యాక్‌డ్రాప్ అంటే బాలయ్యకు లక్కీయే. ఇప్పుడు ఈ సినిమా కథ కూడా రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతోంది. అఖండ అఖండమైన విజయం సాధించాక.. చాలా లాంగ్ గ్యాప్‌లో బాలయ్య నటిస్తోన్న సినిమా కావడంతో నందమూరి అభిమానులు సినిమాపై చాలా ఆశలే పెట్టుకున్నారు.
సినిమాపై ఉన్న భారీ హైప్ కారణంగా వీరసింహారెడ్డికి ఏకంగా రు. 76 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగినట్టుగా చెపుతున్నారు. హయ్యస్ట్‌గా నైజాం ఏరియాలో రు. 22 కోట్లకు ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ సేల్ అయ్యాయంటున్నారు. ఇక సీడెడ్‌లో రు. 15 కోట్లు – ఈస్ట్ 5 కోట్లు – గుంటూరు 6 కోట్లు రేషియోలో రైట్స్ అమ్మారు. ఏపీ, తెలంగాణలోనే ఈ సినిమా థియేట్రికల్ రైట్స్‌ను రు. 66 కోట్లకు అమ్మారు.
ఇక కర్ణాటక రు. 7 కోట్లు – ఓవర్సీస్ 3 కోట్ల వరకు ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. ఓవరాల్‌గా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రు. 78 కోట్ల షేర్ రావాలి. బాలయ్య కెరీర్‌లో హయ్యస్ట్ ప్రి రిలీజ్ బిజినెస్ జరిగిన సినిమా ఇదే. అఖండ రు. 60 కోట్ల రేషియోలో అమ్మారు. ఆ సినిమాతో పోలిస్తే ఇప్పుడు వీరసింహారెడ్డికి మరో రు. 18 కోట్లు ఎక్కువగానే బిజినెస్ జరిగింది.
అఖండ రేంజ్ టాక్ వస్తే వీరసింహుడికి ఇది పెద్ద టార్గెట్ కాదనే చెప్పాలి. సంక్రాంతి సీజన్ ప్లస్ అయినా కూడా అటు చిరు వాల్తేరు వీరయ్య, విజయ్ వారసుడు సినిమాల నుంచి గట్టి పోటీ అయితే తప్పదు.