బలమైన సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చింది వరలక్ష్మి శరత్‌కుమార్. తండ్రి శరత్‌కుమార్ ఒకప్పటీ స్టార్ హీరో. తండ్రి వారసత్వం వరలక్ష్మికి బాగానే కలిసొచ్చింది. ముందుగా హీరోయిన్గా ట్రై చేసింది. కొన్ని హిట్లు పడ్డాయ్. తర్వాత కేవలం హీరోయిన్ పాత్రలే కావాలని పంతానికి పోలేదు. లేడీ విలన్, నెగటివ్ క్యారెక్టర్లు చేసి తనను తాను ఫ్రూవ్ చేసుకుంది. ఒకప్పుడు నరసింహా సినిమాలో నీలాంబరి లాంటి పాత్రలతో రమ్యకృష్ణ ఎంత పాపులర్ అయ్యిందో ఇప్పుడు వరలక్ష్మి అంతే పాపులర్ అయ్యింది.
అటు తమిళంలో కాని, ఇటు తెలుగులో కానీ.. లేడీ విలన్ పాత్రలే వేయాలంటే ముందుగా వరలక్ష్మి మాత్రమే ప్రతి ఒక్కరి మదిలో మెదులుతోంది. సందీప్‌కిషన్ సినిమాలో, విజయ్ సర్కార్ సినిమా, ఇప్పుడు బాలయ్య వీరసింహారెడ్డి సినిమాలోనూ పవర్ ఫుల్ లేడీ విలన్గా నటించి మెప్పిస్తోంది. అసలు బాలయ్య లాంటి పెద్ద ఇమేజ్ ఉన్న హీరో సినిమాలో ఆయన్ను ఢీ కొట్టే పాత్రలో.. అందులోనూ ఆయన్ను చంపే లేడీ విలన్‌గా నటించడం అంటే చాలా గట్సే ఉండాలి.
కానీ వీరసింహారెడ్డిలో వరలక్ష్మి చాలా ధైర్యంగా ఈ పాత్ర పోషించింది. అసలు రమ్యకృష్ణను చూసి కొందరు లేడీ విలన్‌గా నటించే ప్రయత్నం చేసి ఫెయిల్ అయ్యారు. కానీ వరలక్ష్మి మాత్రం ఈ తరం లేడీ విలన్‌గా అదరగొట్టేస్తోంది. మరో 15 ఏళ్ల వరకు ఆమెకు ఈ తరహా పాత్రల్లో తిరుగు ఉండదని.. ఆమెకు పోటీ ఇచ్చే లేడీ విలన్ రావడం సందేహమే అని సౌత్ ఇండియన్ సినిమా జనాలు చెపుతున్నారు.
అసలు చాలా మంది దర్శకులు, రచయితలు అయితే ఆమెను దృష్టిలో ఉంచుకుని నెగటివ్ పాత్రలు, ఇతర పాత్రలు రాసుకుంటున్నారంటే ఆమె క్రేజ్ ఎలా ఉందో తెలుస్తోంది. అసలు క్రాక్ సినిమాలో ఆమె చేసిన పాత్ర చూసే వీరసింహారెడ్డిలో ఆమె పాత్ర రాసుకున్నానని దర్శకుడు గోపీచంద్ స్వయంగా చెప్పారు. అయితే ఈ క్రేజ్‌ను వరలక్ష్మి బాగా క్యాష్ చేసుకునే ప్రయత్నంలో కూడా ఉంది.
వీరసింహారెడ్డి తర్వాత వరలక్ష్మి తాను చేయబోయే నెక్ట్స్ సినిమాలకు కోటికి పైగా … ఇంకా చెప్పాలంటే పెద్ద సినిమా అయితే కోటిన్నర వరకు డిమాండ్ చేస్తోందట. ఈ సినిమా తర్వాత ఆమె తగ్గే ప్రశక్తే లేదన్నట్టుగా ఉంటోందట. అయితే ఆమె రేటుతో నిర్మాతలకు మాత్రం కాస్త చుక్కలు కనపడుతున్నాయంటున్నారు. ఇక మహేష్, త్రివిక్రమ్ సినిమాలోనూ ఆమె నటిస్తోంది. ఆ సినిమాలో కూడా ఆమె క్లిక్ అయితే అసలు వరలక్ష్మి జోరుకు బ్రేకులు ఉండవ్..!