Moviesబాల‌య్య అక్కినేని... తొక్కినేని వ్యాఖ్య‌ల‌పై నాగ‌చైత‌న్య షాకింగ్‌ రియాక్ష‌న్‌... !

బాల‌య్య అక్కినేని… తొక్కినేని వ్యాఖ్య‌ల‌పై నాగ‌చైత‌న్య షాకింగ్‌ రియాక్ష‌న్‌… !

నంద‌మూరి బాల‌కృష్ణ న‌టించిన వీర‌సింహారెడ్డి సినిమా ఈ సంక్రాంతికి వ‌చ్చి సూప‌ర్ హిట్ అయ్యింది. బాల‌య్య కెరీర్‌లో వ‌రుస‌గా రెండో బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాగా వీర‌సింహారెడ్డి రికార్డుల్లోకి ఎక్కేసింది. అయితే ఈ సినిమా విజ‌యోత్స‌వ స‌భ‌లో బాల‌య్య చేసిన వ్యాఖ్య‌లు కాస్త కాంట్ర‌వ‌ర్సీగా మారాయి. బాల‌య్య త‌న‌కు అల‌వాటైన రీతిలో లోప‌ల ఉన్న‌ది ఉన్న‌ట్టు దాచుకోకుండానే పైకి అనేశారు.

అయితే కొంద‌రు దానికి భూత‌ద్దంలో పెట్టి చూస్తూ కాంట్ర‌వ‌ర్సీగా మార్చేశారు. వీర‌సింహారెడ్డి ఈవెంట్‌లో బాల‌య్య మాట్లాడుతూ ఆ నాటి రోజుల్లో సినిమా కోసం ప‌నిచేసిన ఆర్టిస్టులు, టెక్నీషియ‌న్లు అంద‌రిని అభినందించారు. వీళ్ల‌తో త‌న‌కు చక్క‌గా టైం పాస్ అయ్యింద‌ని చెపుతూనే తాము షూటింగ్ స్పాట్‌లో నాన్న‌గారి డైలాగులు, ఆ రంగారావు గారు.. ఈ రంగారావు గారు, అక్కినేని, తొక్కినేని అంటూ అన్నీ మాట్లాడుకునే వాళ్ల‌మ‌ని బాల‌య్య చెప్పాడు.

బాల‌య్య ఉద్దేశంలో ఆనాటి పాత‌కాల‌పు విష‌యాలు కూడా గుర్తు చేసుకునే వాళ్ల‌మ‌ని చెప్పాడు. ఆ పాత‌కాల‌పు విష‌యాలు తాము గుర్తు చేసుకున్నామంటూ బాల‌య్య చెప్పే క్ర‌మంలో తొక్కినేని అని అన‌డం వివాదాస్ప‌దంగా మారింది. అయితే దీనికి కొంద‌రు మ‌సిపూసి మారేడుకాయ చేసేశారు. దీనిపై సోష‌ల్ మీడియాలో కొంద‌రు కావాల‌ని రాద్దాంతం చేస్తున్నారు.

తాజాగా ఇదే అంశంపై అక్కినేని ఫ్యామిలీ హీరో నాగ‌చైత‌న్య కూడా స్పందించారు. నంద‌మూరి తార‌క రామారావు గారు, అక్కినేని నాగేశ్వ‌ర‌రావు గారు, ఎస్‌.వి రంగారావు గారు తెలుగు క‌ళామ‌త‌ల్లి ముద్దుబిడ్డ‌లు.. వారిని అగౌర‌వ‌ప‌రిస్తే.. మ‌న‌ల‌ను మ‌నం అగౌర‌వ‌ప‌రుచుకున్న‌ట్టే అని బాల‌య్య వ్యాఖ్య‌ల‌కు కౌంట‌ర్ ఇచ్చిన‌ట్టుగా పోస్ట్ పెట్టాడు. దీనినే అఖిల్ కూడా షేర్ చేశాడు.

మామూలుగా అక్కినేని హీరోల‌పై సోష‌ల్ మీడియాలో ఎంత రచ్చ జ‌రిగినా ఎప్పుడూ స్పందించారు. స‌మంత‌, నాగ‌చైత‌న్య విష‌యంలో ఎన్నో కాంట్ర‌వ‌ర్సీ వార్త‌లు వ‌చ్చాయి. అఖిల్ ఏంగేజ్‌మెంట్ జ‌రిగిన‌ప్పుడు కూడా ఎవ్వ‌రు మాట్లాడ‌లేదు. కానీ బాల‌య్య వ్యాఖ్య‌ల విష‌యంలో వారి రియాక్ష‌న్ హాట్ టాపిక్‌గా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news