కోట్లాదిమంది పవన్ ఫ్యాన్స్ ఎప్పుడేప్పుడా అంటూ ఆశగా ఎదురు చూసిన అప్డేట్ ని ఆహా రిలీజ్ చేసింది. నిన్న సాయంత్రం బాలయ్య అన్ స్టాపబుల్ షో కి పవన్ కళ్యాణ్ వచ్చిన ఎపిసోడ్ ప్రోమోని రిలీజ్ చేసింది . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో టాప్ట్రెండింగ్ లో దూసుకుపోతుంది బాలయ్య – పవన్ ఎపిసోడ్ . అందరు ఊహించినట్లుగానే బాలయ్య – పవన్ కళ్యాణ్ ని పొలిటికల్ పరంగా పలు ప్రశ్నలు అడిగి జనాల క్వశ్చన్స్ కి క్లారిటీ తీసుకున్నాడు. మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ – చరణ్ గురించి చెప్పిన ఆన్సర్స్ షోకే హైలెట్గా నిలిచాయి .
అంతేకాదు బాలయ్య డేర్ చేస్తూ స్క్రీన్ పై అమ్మ ఫోటో భార్య ఫోటో వేసి.. ఇద్దరిలో ఎవరంటే భయం అని అడగడం హైలెట్ గా మారింది. అంతేకాదు మెగా మేనల్లుడు సాయి ధరంతేజ్ కూడా ఈ ఎపిసోడ్ లో స్పెషల్ గెస్ట్ గా వచ్చి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు . కాగా పవన్ కళ్యాణ్ ను పాలిటిక్స్ పరంగా అందరూ టార్గెట్ చేసే మూడు పెళ్ళిల గురించి బాలయ్య – పవన్ ని స్ట్రైట్ గా అడిగి.. ఆయన వద్ద నుంచి ఆన్సర్ రాబట్టాడు . ఈ క్రమంలోనే బాలయ్య పవన్ పెళ్లిళ్ల గురించి అడిగిన ప్రశ్న హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది .
అయితే బాలయ్య లాంటి స్టార్ హీరో పవన్ కళ్యాణ్ పర్సనల్ క్వశ్చన్ ని అలాంటి టాక్ షోలో అడగడం చాలా హర్ట్ చేసింది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ మూడు పెళ్లిల గురించి ప్రస్తావించడం సమంజసం కాదు అంటూ పవన్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అయితే నందమూరి ఫ్యాన్స్ మాత్రం బాలయ్య ప్రశ్నను పాజిటివ్ గానే చూస్తున్నారు. తప్పు చేయనప్పుడు ఆన్సర్ ఇవ్వడానికి భయం ఎందుకు .. పవన్ తప్పు చేయనప్పుడు పవన్ ఆన్సర్ ఇస్తాడు ..అసలు పవన్ ఏమి ఆన్సర్ ఇచ్చారో ఫుల్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అయ్యేవరకు ఆగండి అంటూ నందమూరి ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు . ఈ క్రమంలోని మరోసారి బాలయ్య – పవన్ ఫ్యాన్స్ మధ్య వార్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!!