Moviesమూడో అల్లుడికి మామ కాస్ట్లీ గిఫ్ట్..కూతురు ఆనందం కోసం చిరు అన్ని...

మూడో అల్లుడికి మామ కాస్ట్లీ గిఫ్ట్..కూతురు ఆనందం కోసం చిరు అన్ని కోట్లు ఖర్చు చేసాడా..?

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో మెగాస్టార్ చిరంజీవి కూతురు ఎక్కువగా ట్రోలింగ్ కి గురవుతుంది. దానికి మెయిన్ రీజన్ ఆమె రెండో భర్తకు విడాకులు ఇచ్చి మూడో పెళ్లి చేసుకోబోతూ ఉండడమే అంటూ తెలుస్తుంది . మనకు తెలిసిందే మెగాస్టార్ చిరంజీవి ముద్దుల కూతురు శ్రీజ ఆల్రెడీ మొదటి భర్తకు విడాకులు ఇచ్చేసి ..రెండో భర్తగా కళ్యాణ్ దేవ్ ను యాక్సెప్ట్ చేసింది. పెద్దలు కుద్ర్చిన ఈ సంబంధాన్ని చేసుకున్న శ్రీజ రెండో భర్తతో కొన్నాళ్లు బుద్ధిగా కాపురం చేసుకుంది.

అయితే వీళ్ళ మధ్య ఏమైందో ఏమో తెలియదు కానీ కళ్యాణ్ దేవ్ కి కూడా శ్రీజ విడాకులు ఇచ్చేసింది అన్న న్యూస్ వైరల్ అవుతుంది. కాగా రీసెంట్గా న్యూ ఇయర్ సందర్భంగా ఆమె సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. “2022 నాకు ఎన్నో ఇచ్చింది.. నా జీవితానికి కొత్త మార్గం చూపించింది . నన్ను ఎంతో ఇష్టపడి ప్రేమించే వ్యక్తిని దగ్గర చేసింది .థాంక్యూ ..”అంటూ చెప్పుకువచ్చింది . ఈ క్రమంలోనే గత కొంతకాలంగా సోషల్ మీడియాలో శ్రీజ మూడో పెళ్లి చేసుకోబోతుంది అంటూ వస్తున్న వార్తలను కన్ఫామ్ చేసుకున్నారు మెగా ఫాన్స్ . రీసెంట్గా మరో న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

మెగాస్టార్ చిరంజీవి తన కూతురు కోసం ఏకంగా 35 కోట్లు ఖర్చు చేసి ఓ పెద్ద బంగ్లాను తనకు గిఫ్ట్ గా ఇచ్చారు అంటూ తెలుస్తుంది. అంతేకాదు ఈ బంగ్లాను చిరంజీవి ఆమెకు సర్ప్రైజ్ గిఫ్ట్ గా ఇచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . మూడో పెళ్లి చేసుకోబోతున్న శ్రీజ.. కాబోయే భర్త ఇదే ఇంట్లో ఉండబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . ఏది ఏమైనా సరే కూతురు సంతోషం కోసం చిరంజీవి ఇలా చేయడం ఓ వర్గం వాళ్లకి నచ్చుతున్న.. మెగా ఫాన్స్ కు మాత్రం శ్రీజ మూడో పెళ్లి చేసుకోవడం ఏం ఇష్టం లేదు అంటూ తెలుస్తుంది. చూడాలి మరి మూడో పెళ్లి పై మెగ ఫ్యామిలీ ఏ విధంగా స్పందిస్తుందో..?

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news