Moviesచిరంజీవి భార్య సురేఖాలో..బాలయ్య భార్య వసుంధర లో..ఉన్న కామన్ క్వాలిటీ ఇదే..!!

చిరంజీవి భార్య సురేఖాలో..బాలయ్య భార్య వసుంధర లో..ఉన్న కామన్ క్వాలిటీ ఇదే..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది స్టార్స్ ఉన్నా సరే ..టాలీవుడ్ అని చెప్పగానే పక్క భాష నటుల ముఖ్యంగా చెప్పే రెండే రెండు పేర్లు చిరంజీవి – బాలకృష్ణ . ఒకప్పుడు ఎన్టీఆర్ , ఏఎన్నార్ అంటూ గర్వంగా చెప్పుకునే ఆ జనాలే ..ఇప్పుడు చిరంజీవి – బాలకృష్ణ అంటూ సగర్వంగా చెప్పుకుంటున్నారు. అంతలా మన తెలుగు ఇండస్ట్రీ పరువు కాపాడుతూ వస్తున్నారు చిరంజీవి – బాలకృష్ణ . కాగా ఈ హీరోలు ఇండస్ట్రీలో ఎంత స్టార్స్ గా ఉన్నారో ఈ హీరోల భార్యలు ఇల్లాలుగా అంతే స్టార్స్ గా మారారు .

మనకు తెలిసిందే చిరంజీవి భార్య సురేఖ .. బాలయ్య భార్య వసుంధర ఎంత చక్కగా ఉంటారో. బయటకు వస్తే వాళ్ళ భర్తల పరువుల్ని పెంచే విధంగానే బిహేవ్ చేసుకుంటారు . కానీ ఏనాడు ఓ మాట వీళ్ల గురించి నెగటివ్గా వినిపించిందే లేదు . అంతలా తెలుగింటి సాంప్రదాయాలను ఫాలో అవుతూ ఉంటారు . కాగా సురేఖలో ..బాలయ్య భార్య వసుంధరలో ఉన్న కామన్ పాయింట్ వీళ్ళకి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది అంటూ జనాలు చెప్పుకుంటున్నారు.

చిరంజీవి భార్య సురేఖ ఇంటికి వచ్చిన వాళ్ళకి లేదు కాదు అనుకుండా హెల్ప్ చేస్తుందట . అంతేకాదు ఇంటికి వచ్చిన వాళ్ళకి కడుపునిండా భోజనం పెట్టి పంపిస్తుందట. అది ఎవరైనా సరే ఇంటికి అభిమానం చూపించడానికి వచ్చిన అభిమాని అయినా.. ఇంట్లోని పనివాళ్ళు అయినా ..ఇంటికి వచ్చిన స్టార్ హీరోస్ అయినా.. ఎవరైనా సరే ఇంటికి వస్తే కడుపు నిండా తినిపించి.. సంతోషంగా అడుగు బయటకు పెట్టేలా చేస్తుందట సురేఖ.

బాలయ్య భార్య వసుంధర కూడా అంతే . ఇంటికి వచ్చిన వాళ్ళకి గౌరవ మర్యాదల్లో ఏమాత్రం లోటు చేయకుండా నందమూరి పరువు పేరు ప్రతిష్టలను డబల్ చేసింది వసుందర అంటూ ఇప్పటికీ బాలయ్య పలు ఇంటర్వ్యూలో చెప్పుకొస్తూ ఉంటారు . వీళ్ళ ఇద్దరికున్న ఈ మంచితనం కారణంగానే ఇండస్ట్రీలో చిరంజీవి – బాలయ్య ల పేర్లు మరింత రేంజ్ లో పాపులారిటీ దక్కించుకుంటుందని జనాలు చెప్పుకొస్తున్నారు . ఏమైనా సరే ఇద్దరు మంచి వైఫ్స్ ని పెళ్లి చేసుకొని లైఫ్ లో లక్కీ ఫెలోస్ అనిపించుకున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news