సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్‌కి గతంలో మాదిరిగా లైఫ్ స్పాన్ ఉండటం లేదు. చాలావరకూ తగ్గిపోయింది. ఎగిసిపడిన కెరటంలా దూసుకొచ్చిన హీరోయిన్ కూడా ఒకే ఒక్క ఫ్లాప్‌తో కనుమరుగైపోతోంది. ఇక్కడ అందాల ఆరబోత మాత్రమే ఉంటే సరుపోదు. కానీ, ఇటీవల కాలంలో ఇండస్ట్రీకి హీరోయిన్‌గా పరిచయమైన వారు నమ్ముకుంటుంది వాటినే.
హీరోతో బెడ్రూం సన్నివేశాలున్నాయా..డీప్ లిప్ కిస్సులున్నాయా..బికినీ వేసి రచ్చ లేపాలా..ఇలా కథ గురించి కాకుండా ఎక్స్ట్రా వాటి గురించే ఎక్కువ ఆలోచించి సినిమా ఒప్పుకుంటున్నారు. కాస్త ఫేం వచ్చిన హీరోయిన్స్ అయితే కథ ఎలా ఉన్నా ఒక్కోదానికి అదనపు రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారు. మేకర్స్‌కి కావాల్సింది హీరోయిన్ చెప్పింది చేయడం.
అలా చేసే హీరోయిన్స్‌నే మన దర్శక నిర్మాతలు రిపీటెడ్‌గా తీసుకుంటున్నారు. కానీ, వాళ్ళూ ఎక్కువ సినిమాలు చేయడం లేదు. పూజా హెగ్డే కెరీర్ ప్రారంభంలో ఎలా సాగిందో మనందరికీ తెలిసిందే. మనవాళ్ళు ఎంకరేజ్ చేయడంతో బికినీ వేసి అలరించింది. ఆ తర్వాత అందాలను ఆరబోస్తూ పాన్ ఇండియన్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది. రష్మిక మందన్న కూడా కమర్షియల్ హీరోయిన్‌గా సక్సెస్ కావడానికి అన్నీ చేసింది.
కీర్తి సురేష్ కూడా పంథా మార్చేసి అందాల విందు బాగానే ఇచ్చింది. తొడ అందాలను చూపించి వేడెక్కించింది. కానీ..ఈ స్టార్ హీరోయిన్స్‌కి ఇప్పుడు ఆశించిన అవకాశాలు దక్కడం లేదు. వారే కాదు, కుర్రభామలు శ్రీలీల, కేతిక శర్మ, కృతిశెట్టిల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. అందాలు ఆరబోసినా కూడా సక్సెస్‌లు దక్కక అల్లాడిపోతున్నారు.