Moviesబన్నీ భార్య ఇంత గ్లామర్‌గా కనిపిస్తుంటే వాళ్ళకి సెగలు రేగుతున్నాయా..?

బన్నీ భార్య ఇంత గ్లామర్‌గా కనిపిస్తుంటే వాళ్ళకి సెగలు రేగుతున్నాయా..?

మన టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సతీమణి స్నేహలత రెడ్డి గురించి ఎప్పుడు సోషల్ మీడియాలో చర్చలు జరుగుతూనే ఉంటుంది. నెటిజన్స్ అలాగే బన్నీ అభిమానులు ఆమె గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవడం మరీ ముఖ్యంగా బన్నీ లేడీ ఫాలోవర్స్..ఫ్యాన్స్ ఆమె అందం గురించి పొగుడుతుండటం ఇప్పటికే చాలాసార్లు చూశాము.

హీరోయిన్ కంటే ఏమాత్రం తగ్గని గ్లామర్ మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహలతా రెడ్డి సొంతం. బన్నీ ఏ పబ్లిక్ ఫంక్షన్‌కి వెళ్ళినా కూడా తన అందాల భార్య ఉండాల్సిందే. ఫ్యామిలీని అంత బాధ్యతగా చూసుకునే బనీ తన భార్య ఇష్టాలను అస్సలు కాదనరని ఆమెను చూస్తేనే అర్థమవుతోంది. ముఖ్యంగా ఎంతో స్టైలిష్‌గా తయారై కెమెరాల ముందుకు వచ్చి భర్తతో ఫోలివ్వడం అందరికీ ఎంతో సంతోషాన్ని ఇస్తుంది.

అయితే, ఇటీవల కాస్త గ్లామర్ డోస్ ఎక్కువగా చూపించి నెటిజన్స్ కి మతులు పోగొడుతోంది అల్లు స్నేహ. హీరోయిన్ కంటే కూడా ఎక్కువ ఫ్యాషనిజం చూపిస్తూ హీరోయిన్స్‌కే ఛాలెంజ్ విసురుతోంది. చాలామంది హీరోయిన్స్ బయటపడటం లేదు గానీ, అల్లు స్నేహ కాస్ట్యూంస్..ఆమే తయారయ్యే విధానానికి కాస్త కుళ్ళుకుంటున్నారనే చెప్పక తప్పదు.

బయట కనిపించినప్పుడు బన్నీ పక్కన ఓ స్టార్ హీరోయిన్‌లా మెరిసిపోతుంది అల్లు స్నేహ. ఈమెను ఇటీవల చూస్తున్న వారందరూ నోరెళ్ళబెడుతున్నారు. కొందరు యూత్ అయితే ఈమె మా హీరోయిన్ అని కూడా ఫీలవుతున్నారట. అంతగా మన స్టైలిష్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సతీమణి అల్లి స్నేహ ఎప్పటికప్పుడు గ్లామర్ ఫొటో షూట్ పిక్స్‌తో అరుపులు అరిపిస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news