Moviesఇండస్ట్రీలో మరో పెళ్ళి భాజా.. పూజా హెగ్డే పెళ్లి చేసుకోబోతుందోచ్.. వరుడు...

ఇండస్ట్రీలో మరో పెళ్ళి భాజా.. పూజా హెగ్డే పెళ్లి చేసుకోబోతుందోచ్.. వరుడు అతడే..!!

టాలీవుడ్ బుట్ట బొమ్మగా పేరు సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ పూజా హెగ్డే పెళ్లి చేసుకోబోతుందా..? అంటే అవుననే అంటున్నారు బాలీవుడ్ మీడియా వర్గాలు. తెలుగులో, తమిళంలో, హిందీలో తనదైన స్టైల్ లో సినిమాలు చేసి ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న పూజా హెగ్డే.. గత ఏడాది ఆమె నటించిన నాలుగు సినిమాలు డిజాస్టర్ గా మారాయి .

ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో మళ్ళీ ఐరెన్ లెగ్ అంటూ ట్రోల్స్ చేస్తున్నారు . అయితే పూజ హెగ్డే ప్రజెంట్ తన ఆశలన్నీ సల్మాన్ ఖాన్ తో చేసిన సినిమా పైనే పెట్టుకుని ఉంది . ఒకవేళ ఈ సినిమా కనుక ఫ్లాప్ అయితే పూజ హెగ్డే కెరీర్ ఫుల్ స్టాప్ పడినట్లే . అయితే ఇదే క్రమంలో పూజ హెగ్డే పెళ్లి పై మనసు మళ్లిందని ..ఆమె పెళ్లి చేసుకోవడానికి సిద్ధం గా ఉంది అంటూ తల్లిదండ్రులకు చెప్పుకొచ్చిందట. అంతేకాదు తన చిన్న నాటి స్నేహితుడునే ఆమె పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడింది అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది.

దీంతో తెలుగు-తమిళ-బాలీవుడ్ మీడియాలో పూజా పాప పెళ్లి న్యూస్ వైఅర్ల్ అవుతుంది.ఒకవేళ అదే నిజమైతే ఈ ఏడాదిలోనే పూజా హెగ్డే పెళ్లి పీటలు ఎక్కేస్తుంది అంటున్నారు సినీ విశ్లేషకులు. అప్పుడు ఇక పూజా హెగ్డే సినిమాలకు గుడ్ బై చెప్పేసే ఛాన్సెస్ నే ఎక్కువ ఉన్నాయి అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news