టాలీవుడ్ యంగ్ హీరో గా పేరు సంపాదించుకున్న వరుణ్ సందేశ్ కెరియర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచిన సినిమా కొత్త బంగారులోకం . శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన ఈ సినిమా యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా అభిమానులను ఆకట్టుకుంది . మరీ ముఖ్యంగా కాలేజ్ డేస్ కుర్రాళ్లకు ఈ సినిమా పిచ్చపిచ్చగా నచ్చేసింది . రియాలిటీని కళ్ళకు కట్టినట్లు చూపించాడు డైరెక్టర్ . అంతేకాదు ఈ సినిమా ద్వారానే హ్యూజ్ రేంజ్ పబ్లిసిటీని సంపాదించుకుంది హీరోయిన్ శ్వేతా బసు ప్రసాద్ .
కాగా నిజానికి ఈ సినిమాను అనుకున్నప్పుడు డైరెక్టర్ ఈ పాత్రకు మొదటగా అనుకున్న హీరో అక్కినేని నాగచైతన్య. అయితే సినిమా కథ బాగున్న పాత్ర నచ్చిన ఈ సినిమాను వదులుకున్నాడట . దానికి మెయిన్ రీజన్ అక్కినేని నాగార్జున. నాగచైతన్యను క్లాస్ సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి ఇంట్రడ్యూస్ చేస్తే అదే ముద్ర పడుతుందని.. మాస్ యాంగిల్ కంటెంట్ తో సినిమాల్లో ఎంట్రీ ఇస్తే కెరియర్ దూసుకుపోతుందన్న భావనతో ఈ సినిమా ఆఫర్ ఇచ్చిన దిల్ రాజుకు నో చెప్పాడట .
ఈ క్రమంలోనే దిల్ రాజు ఆ తర్వాత పలు హీరోలను చర్చించిన ఫైనల్ గా శేఖర్ కమ్ముల తీసిన హ్యాపీ డేస్ సినిమాలో మెయిన్ రోల్ చేసిన వరుణ్ సందేశ్ ను ఫైనల్ చేశారట . ఇదే క్రమంలో ఈ సినిమాను వదులుకొని నాగచైతన్య బిగ్గెస్ట్ తప్పు చేశాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా చేసిన వరుణ్ సందేశ్ పేరు ఇప్పటికీ కొత్త బంగారులోకం హీరోగానే గుర్తిస్తున్నారు అంటే ఈ మూవీ ఎంతటి మంచి విజయాన్ని అందుకుందో అర్థం చేసుకోవచ్చు. ఇదే కాదు నాగ చైతన్య కెరియర్ లో చాలా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమాలను వదులుకున్నాడు . దానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ నాగార్జున . ఇప్పటికి నాగచైతన్య చేసిన సినిమాల కథల విషయంలో నాగార్జున అప్పర్ హ్యాండ్ తీసుకుంటాడని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తుంది..!!