ఇది నిజంగా మెగా అభిమానులకు షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. ఇన్నాళ్లు ఎప్పుడెప్పుడా అంటూ ఆశగా ఎదురు చూసిన గుడ్ మూమెంట్ రానే వచ్చింది. అయితే మెగా కోడలు ఉపాసన ప్రెగ్నెంట్ అని తెలిసినప్పటి నుంచి సోషల్ మీడియాలో రకరకాలుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. వాటిలో ఏది నిజం ఏది అబద్దం గెస్ చేయడమే పెద్ద తలనొప్పిగా మారింది . అంతే కాదు ఇలాంటి వార్తలు పై మెగా ఫ్యామిలీ కానీ ఉపాసన కానీ రెస్పాండ్ కాకపోవడంతో ఆ వార్తలు నిజమే అన్న స్దాయికి వెళ్లిపోయారు మెగా ఫాన్స్.
కాగా ఇప్పటికే మెగా కోడలు ఉపాసన సరోగసి ప్రాసెస్ తో బిడ్డను కనాలనుకుంటుంది అంటూ వార్తలు వినిపించగా..ఆమె బేబి బంప్ ఫొటోస్ షేర్ చేసి ఆ రూమర్స్ కు చెక్ పెట్టింది . రీసెంట్ గా ఉపాసన కవల పిల్లలకు జన్మనివ్వబోతుంది అంటూ మరో క్రేజీ రూమర్ హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. కాగా ఇప్పటివరకు దీనిపై మెగ కోడలు ఉపాసన ఎటువంటి అఫీషియల్ ప్రకటన ఇవ్వలేదు. కాగా రీసెంట్గా మెగా కోడలు ఉపాసన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తమకు పుట్టబోయే బిడ్డ విషయంలో షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో వార్త వైరల్ గా మారింది .
తమకు పుట్టబోయే బిడ్డని ఇండస్ట్రీకి , సోషల్ మీడియాకి దూరంగా ఉండేలా పెంచడానికి నిర్ణయం తీసుకున్నారట . సినీ ఇండస్ట్రీలోకి వచ్చే వీళ్ళు లేకుండా మెగాకోడలు ఉపాసన కఠినంగా నిర్ణయం తీసుకుందట . పెద్ద చదువులు చదివి నలుగురికి ఉపయోగపడేలా డాక్టర్ అవ్వాలని ఉపాసన కోరుకుంటుందట. దీంతో రాంచరణ్ ఉపాసన కోరికను యాక్సెప్ట్ చేసి సోషల్ మీడియాకి సినిమా ఇండస్ట్రీకి మెగా వారసుడిని దూరంగా పెంచాలని డిసైడ్ అయ్యారట. ఇదే న్యూస్ మెగా ఫాన్స్ ను తీవ్రంగా కలవరపడుతుంది . మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తర్వాత ఇండస్ట్రీకి రాబోయే మెగా వారసుడు ఇతడే అనుకుంటున్నా టైంలో ఇలా ఉపాసన నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదు అంటూ మెగా ఫాన్స్ అభిప్రాయపడుతున్నారు . చూడాలి మరి ఏం జరుగుతుందో..?