Movies' వీర‌సింహారెడ్డి ' ట్రైల‌ర్ అప్‌డేట్‌... బాల‌య్య‌ మాస్ కిక్ రా...

‘ వీర‌సింహారెడ్డి ‘ ట్రైల‌ర్ అప్‌డేట్‌… బాల‌య్య‌ మాస్ కిక్ రా ఇది…!

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కిన లేటెస్ట్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ వీర‌సింహారెడ్డి. బాల‌య్య‌కు జోడీగా శృతీహాస‌న్ హీరోయిన్‌గా న‌టించ‌గా.. థ‌మ‌న్ స్వ‌రాలు అందించారు. ఇప్ప‌టికే సినిమా నుంచి రిలీజ్ అయిన స్టిల్స్‌, సాంగ్స్ అన్నీ కూడా వీర‌సింహుడి మానియాలోకి తీసుకుపోయాయి. ఈ సినిమాలో క‌న్న‌డ న‌టుడు దునియా విజ‌య్ బాల‌య్య‌ను ఢీ కొట్టే ప్ర‌తి నాయ‌కుడి పాత్ర‌లో క‌నిపిస్తున్నాడు.

ఈ రోజు డేట్ ఆల్రెడీ 3. ఈ సినిమా థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేందుకు మ‌రో 8 రోజులు టైం మాత్ర‌మే ఉంది. మ‌రోవైపు ట్రైల‌ర్ ఎప్పుడు వ‌స్తుందా ? అని బాల‌య్య ఫ్యాన్స్ అయితే క‌ళ్లు కాయ‌లు కాచిపోయేలా వెయిట్ చేస్తున్నారు. ఇక‌ వీరసింహారెడ్డి నుంచి నాలుగవ సాంగ్ మాస్ మొగుడు రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేసారు. మాస్ మొగుడు అన్న ప‌ల్ల‌వి బ‌య‌ట‌కు వ‌చ్చిన వెంట‌నే ఈ సాంగ్ కూడా అదిరిపోయే బ్లాక్ బ‌స్ట‌రే అని అంద‌రూ ఫిక్స్ అయిపోయారు.

 

ఇదిలా ఉంటే ఈ క్ర‌మంలో మ‌రో ట్విస్ట్ ఇచ్చారు మేక‌ర్స్‌. ఈ సాంగ్‌ను కొద్ది రోజుల పాటు వాయిదా వేసి.. ఈ లోగా థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ రిలీజ్ చేసే ప్లాన్‌లో ఉన్నార‌ట‌. ఈ విష‌య‌మై వీర‌సింహారెడ్డి యూనిట్ నుంచి అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న కూడా వ‌చ్చేసింది. సినిమా రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో ఫ్యాన్స్‌లో మ‌రింత ఎగ్జైట్మెంట్ పెంచేందుకు ఇప్పుడు థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌ను వ‌దిలేస్తున్నారు.

ట్రైల‌ర్ అయితే ప‌క్కా బాల‌య్య మార్క్ మాస్ కిక్‌లా ఉండ‌బోతోంద‌ట‌. ఒక‌టి రెండు రోజుల్లోనే థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ రానుంది. మ‌రో వైపు ఫ‌స్ట్ కాపీ కూడా రెడీ అయిపోవ‌డంతో సెన్సార్‌కు పంపే ప్ర‌క్రియ‌ను కూడా మేక‌ర్స్ స్టార్ట్ చేసేశారు. ఇక ఒంగోలులో జ‌రిగే ప్రి రిలీజ్ ఈవెంట్ కోసం కూడా అందరూ రెడీగా ఉండాల‌ని కూడా మేక‌ర్స్ చెప్ప‌డంతో ఫ్యాన్స్ జోష్ అయితే మామూలుగా లేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news