Moviesయాంటీ మీడియాలోనూ ' వీర‌సింహారెడ్డి ' కి పాజిటివ్ టాక్‌... బాల‌య్య...

యాంటీ మీడియాలోనూ ‘ వీర‌సింహారెడ్డి ‘ కి పాజిటివ్ టాక్‌… బాల‌య్య బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టేసిన‌ట్టే..!

నందమూరి బాలకృష్ణ-శృతి హాసన్-గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో మైత్రీ మూవీస్ నిర్మించిన ప్ర‌తిష్టాత్మ‌క సినిమా వీర‌సింహారెడ్డి. సంక్రాంతికి రిలీజ్ అవుతోన్న ఈ సినిమా స్టిల్స్‌, పాట‌లు, టీజ‌ర్లు, ట్రైల‌ర్లు అయితే అదిరిపోయాయ‌నే అంటున్నారు. ఇక ఈ నెల 12న వీర‌సింహుడు థియేట‌ర్ల‌లోకి దిగేందుకు రెడీ అయిపోతున్నాడు. సెన్సార్ కంప్లీట్ చేసుకున్న వీర‌సింహాకు సెన్సార్ నుంచి యూ / ఏ స‌ర్టిఫికెట్ వ‌చ్చేసింది.

ఇక సెన్సార్ టాక్‌తో పాటు ఇండ‌స్ట్రీ ఇన్న‌ర్ స‌ర్కిల్స్ టాక్ కూడా బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. సినిమా స‌హ‌జంగానే బాగుంద‌నే టాక్ వినిపిస్తోంది. అన్నింటికి మించి ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏంటంటే ఓ సామాజిక వ‌ర్గం హీరోలు, ద‌ర్శ‌కుల సినిమాల‌తో పాటు ముఖ్యంగా బాల‌య్య సినిమాల‌పై ఎప్పుడు విరుచుకు ప‌డే ఓ సెక్ష‌న్ మీడియా, వెబ్‌సైట్లు కూడా వీర‌సింహాకు సెన్సార్ టాక్ అదిరిపోయింద‌ని, ప్రి రిలీజ్ బ‌జ్ మామూలుగా లేద‌ని ఆకాశానికి ఎత్తేస్తున్నాయి.

బాల‌య్య లెజెండ్‌, శాత‌క‌ర్ణి నుంచి రీసెంట్‌గా వ‌చ్చిన అఖండ వ‌ర‌కు బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ సినిమాలు కూడా బాగోలేద‌ని చెప్ప‌డం.. లేదా సినిమాలో ఏదో ఒక నెగ‌టివ్ పాయింట్ ప‌ట్టుకుని రాత‌లు రాయ‌డం.. త‌క్కువ రేటింగ్‌లు ఇవ్వ‌డ‌మే ఆ వెబ్‌సైట్ ప‌ని. అలాంటి సైట్లో కూడా వీర‌సింహారెడ్డి గురించి పాజిటివ్‌గా రాశారు. ఒక్క‌సారి ఆ సైట్లో విశ్లేష‌ణ ప్ర‌కారం చూస్తే వీర‌సింహారెడ్డి సినిమా అనేది బాల‌య్య వీర‌విహార‌మే అని.. సినిమాలో యాక్ష‌న్ సీన్లు అదిరిపోవ‌డంతో పాటు బాల‌య్య క్యారెక్ట‌ర్ ప‌వ‌ర్ ఫుల్‌గా ఉంద‌ని చెప్పారు.

 

బాల‌య్య న‌ట‌న అదిరిపోయింద‌ని… బాల‌య్య‌కు, వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్‌కు మ‌ధ్య ఎమోష‌న‌ల్ సీన్లు అదిరిపోవడంతో పాటు సినిమాకే హైలెట్ అని ఆ సైట్ రాసుకువ‌చ్చింది. ఫ‌స్టాఫ్‌లో సినిమాకు హై ఇచ్చే 20 నిమిషాల యాక్ష‌న్ సీన్లు, సెకండాఫ్‌లో పాట‌లు, ఫైట్ల‌తో కాస్త టైట్ ప్యాక్ అయ్యింద‌ట‌. ఇక మూడు పాట‌లు, ఓ బిట్ సాంగ్‌, ఫైట్లు అన్నీ బాగా సెట్ అవ్వ‌డంతో సెకండాఫ్ సినిమా మంచి టైట్‌గా, ఆద్యంత అదిరిపోయేలా ఉందంటున్నారు.

ఇక ప‌వ‌ర్ ఫుల్ డైలాగుల‌తో పాటు, బాల‌య్య స్టెప్పులు, డైలాగులు అన్నీ కూడా ప్రేక్ష‌కులు బాగా క‌నెక్ట్ చేసుకునేలా ఉన్నాయ‌ని.. ఈల‌లు, చ‌ప్ప‌ట్ల‌తో ఓవ‌రాల్‌గా సంక్రాంతికి బాల‌య్య ఓ ప‌వ‌ర్ ఫుల్ సినిమా అందిస్తున్నార‌ని ఆ సైట్ రాసుకువ‌చ్చింది. ఏదేమైనా ఎప్పుడూ బాల‌య్య‌ను నెగ‌టివ్‌గా ప్రొజెక్ట్ చేసేందుకు తాప‌త్ర‌య మీడియా నుంచే ఈ టైప్ ప్ర‌శంస‌లు వ‌స్తుండ‌డంతో వీర‌సింహారెడ్డితో బాల‌య్య ఖ‌చ్చితంగా మ‌రో బ్లాక్‌బస్ట‌ర్ కొట్టేలా ఉన్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news