సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కోచ్ అన్న పదం ఎంత కామన్ గా వినిపిస్తుందో అందరికీ తెలిసిందే. సినిమాలో హీరోయిన్గా ఛాన్స్ రావాలి అన్నా.. వచ్చిన ఛాన్సెస్ అలాగే నిలబెట్టుకొవాలి అన్నా.. స్టార్ హీరోయిన్గా మారాలి అన్న సదరు సినిమా డైరెక్టర్ , ప్రొడ్యూసర్, హీరోలను సుఖ పెట్టాల్సిందే . వాళ్ళ పడకగదిలోకి వెళ్లాల్సిందే అనే కామెంట్లు గతంలో చాలామంది చెప్పుకొచ్చారు. కొందరు హీరోయిన్స్ చెప్పుకొచ్చారు.
అయితే సౌత్ ఇండియాలోనే స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న నయనతార ..క్యాస్టింగ్ కౌచ్ పై పదవి విప్పడం సంచలనంగా మారింది . మొదటి నుంచి తన పర్సనల్ విషయాలపై ఎక్కువగా ఓపెన్ అప్ అవ్వని నయనతార రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో క్యాస్టింగ్ కౌచ పై సంచలన కామెంట్స్ చేసింది . తాను క్యాస్టింగ్ కౌచ్ కి బలయ్యాను అంటూ చెప్పకు వచ్చింది . ఈ క్రమంలోనే నయనతార చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.
నయనతార మాట్లాడుతూ..” ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందా అంటే అవుననే అంటాను . నన్ను కొందరు డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ విసిగించారు .. వేధించారు పక్కలోకి రమ్మంటూ ఫోర్స్ చేశారు . కానీ అది పూర్తిగా మన ప్రవర్తనపై ఆధార పడి ఉంటుంది . నేను నిర్మొహమాటంగా నో చెప్పాను . దెబ్బకి నా జోలికి ఎవరు రాలేదు. మనం కాస్త తగ్గిన అవకాశాల కోసం ఎదురు చూడడంలో పొరపాటు జరిగిన వాళ్ళకి అలుసుగా కనిపిస్తాం .మన పద్ధతి పైనే ఎదుటి వాళ్ళ క్యాస్టింగ్ కావచ్చును అడుగుతారు “అంటూ సంచలన కామెంట్స్ చేసింది . ఈ క్రమంలోని నయనతార మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..!!