టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్ సినిమా జీవితం జోరు మీదున్నా ఆయన వ్యక్తిగత జీవితం మాత్రం పెళ్లిళ్ల గోలగా మారింది. గత రెండేళ్లలో నరేష్ మీడియాలో చాలా కాంట్రవర్సీగా మారిపోయారు. ముందు మా ఎన్నికల్లో ఆయన చుట్టూ పెద్ద గోలే నడిచింది. ఆ తర్వాత ఆయన మూడో భార్య రమ్య రఘుపతి ఆయనపై తీవ్ర విమర్శలు చేయడం… ఇటు నరేష్ కూడా రమ్యపై ఘోరమైన ఆరోపణలు చేయడం.. ఇటు తనతో కలిసి వరుసగా సినిమాలు చేస్తోన్న నటి పవిత్రా లోకేష్‌తో సహజీవనం.. పెళ్లి వార్తలు మామూలుగా వైరల్ కావడం లేదు.
ఇక నరేష్, పవిత్రను నాలుగో పెళ్లి చేసుకునేందుకు రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే. అయితే నరేష్‌కు ఇంతకు ముందే మూడు పెళ్లిళ్లు అయ్యాయి. నరేష్‌కు 19 ఏళ్ల వయస్సులోనే ప్రముఖ సినిమాటోగ్రాఫర్ హీరాలాల్ (శ్రీనివాస్) కుమార్తెతో పెళ్లయ్యింది. అయితే వీరికి నవీన్ ( టాలీవుడ్‌లో హీరోగా కూడా పరిచయం అయ్యాడు) పుట్టాక ఆమె మానసికమైన వ్యాధితో సంసార జీవితానికి పూర్తిగా దూరమైంది.
అందుకే నరేష్ రెండో వివాహం చేసుకున్నాడు. ( కొద్ది రోజుల క్రితం నరేష్ మొదటి భార్య చనిపోయారు కూడా).. నరేష్ రెండో భార్య ఎవరో కాదు దేవులపల్లి కృష్ణశాస్త్రికి మనవరాలు రేఖా సుప్రియ. ఆమె తండ్రి ఎవరో కాదు బుజ్జాయి రచయిత సుబ్బరాయ శర్మ. శర్మ, విజయనిర్మల సన్నిహితులు కావడంతో ఈ సంబంధం సెట్ అయ్యింది. పెళ్లి తర్వాత ఈ దంపతులకు పుట్టిన బిడ్డ తేజకు అటిజం సమస్య వచ్చింది.
దీంతో పిల్లాడు పెరిగి పెద్దవాడు అవుతున్నా.. మానసిక ఎదుగుదల మాత్రం లేదు. దీనికి తోడు నరేష్ అదే టైంలో ఇటు సినిమాల్లోనూ, ఇటు వ్యాపారాల్లోనూ పుల్ బిజీ అయ్యారు. సినిమాల్లో హీరోగా చేయడం, ఇటు వ్యాపారాలపై దృష్టి పెట్టి ఫ్యామిలీకి సరైన టైం కేటాయించలేకపోయారు. ఇదే విషయమై భార్య, భర్తల మధ్య ఏర్పడిన చిన్న గొడవలు చివరకు పెద్దవి అయ్యాయి.
తనకు టైం కేటాయించేంత బిజీ లైఫ్ నువ్వు గడుపుతున్నప్పుడు నీకు నేను భార్యగా ఎందుకు ఉండాలని రేఖ వేసిన ప్రశ్నకు నరేష్ దగ్గర ఆన్సర్ లేదు. అలా ఒప్పందంతోనే వీరు విడిపోయారు. అయితే విడిపోయినా రేఖా, నరేష్ మాత్రం స్నేహితులుగానే ఉంటున్నారు. వీరి బాధ్యత కూడా నరేష్ తీసుకున్నాడని టాక్ ? విడాకుల తర్వాత రేఖా సుప్రియ తన కొడుకు తేజ లాంటి మరి కొంతమంది పిల్లలను దత్తత తీసుకుని వారికి తన పూర్తి ఖర్చులతో బాగోగులు చూస్తోంది.
ఓ ట్రస్ట్ స్టార్ట్ చేసి ఆటిజంతో బాధపడుతోన్న పిల్లలకు, వారి తల్లి దండ్రులకు కోచింగ్ కూడా ఇప్పిస్తోంది.
రేఖా సుప్రియది చాలా మంచి మనస్తత్వం అని.. నరేష్ ఫ్యామిలీకి టైం స్పెండ్ చేయకపోవడం వల్లే వీరి జీవిత బంధం ఎక్కువ కాలం కొనసాగలేదని అంటారు. అయితే విడాకుల తర్వాత కూడా ఆమె ఆటిజం పిల్లల కోసం ఎంతో కష్టపడుతోంది.