Movies"ప్లీజ్ ..నన్ను క్షమించండి..పొరపాటున జరిగింది".. బాలయ్య బహిరంగ క్షమాపణలు..!!

“ప్లీజ్ ..నన్ను క్షమించండి..పొరపాటున జరిగింది”.. బాలయ్య బహిరంగ క్షమాపణలు..!!

నందమూరి బాలయ్య గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . కోపం వస్తే ఎంత ఘాటుగా మాట్లాడుతారో.. ప్రేమ వస్తే అంతకన్నా ప్రేమగా దగ్గరికి తీసుకుంటారు . రూసెంట్ గా గోపీ చంద్ మల్లినేని డైరెక్షన్ లో తెరకెక్కిన వీర సింహారెడ్డి సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్న బాలకృష్ణ.. అభిమానులకు , ప్రేక్షకులకు బహిరంగంగా క్షమాపణలు చెప్పారు . దానికి కారణం ఆయన పొరపాటున మాట్లాడిన మాటలే అంటూ తెలుస్తుంది.

రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో బాలకృష్ణ మాట్లాడుతూ..”దేవ బ్రాహ్మణులకు దేవల మహర్షి గురువు అని.. ఇక అలా దేవల మహర్షికి నాయకుడు.. ఆ రావణాసురుడు అవుతాడు అని చెప్పారు. అయితే బాలకృష్ణ వ్యాఖ్యలను దేవాంగ కులస్తులు చాలా సీరియస్ గా తీసుకుని తప్పు పడుతున్నారు. ఈ క్రమంలోనే బాలకృష్ణ తన వ్యాఖ్యలపై స్పందించి క్లారిటీ ఇచ్చారు.

దేవబ్రాహ్మణులకు నాయకుడు రావణబ్రహ్మ అనేది తప్పుడు సమాచారం అని చెప్పుకొచ్చారు. అది దురదృష్టవశాత్తూ అలా ఆసందర్భంలో అలవోకగా వచ్చిన మాట మాత్రమేనని ..కావాలని ఏది చెప్పలేదని.. తన పొరపాటును మన్నిస్తారని ఆశిస్తున్నట్టుగా కోరారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. దీంతో నందమూరి బాలయ్య లో ఉన్న ఈ గుడ్ క్వాలిటీ మరోసారి సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు నందమూరి ఫ్యాన్స్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news