టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఎంత కూల్ మైండ్ సెట్ ఉన్న మనిషో అందరికీ తెలిసిందే. సాధారణంగా పలువురు స్టార్ సెలబ్రిటీస్ మీడియా సమావేశంలో ఫ్యాన్స్ హంగామాతో విసుకు చెంది పోయి ఫైర్ అయిన సందర్భాలు ఎన్నో చూసాం . అయితే మెగాస్టార్ చిరంజీవి తన కెరియర్ స్టార్టింగ్ నుంచి నిన్న రిలీజ్ అయిన వీరసింహారెడ్డి సినిమా ఈవెంట్లో వరకు ఎక్కడ తన టంగ్ స్లిప్ అవ్వకుండా చాలా కూల్ గా సైలెంట్ గా జనాలకు కనిపించాడు.
అయితే రీసెంట్ గా వీరసింహారెడ్డి సక్సెస్ ప్రమోషన్స్ లో మాట్లాడిన డైరెక్టర్ బాబి ..మాత్రం చిరంజీవి ఎంత కమిట్మెంట్ గల వ్యక్తి అని చెప్పి షాక్ ఇచ్చాడు . ఈ క్రమంలోనే ఓ ఇన్సిడెంట్ ను అభిమానులతో షేర్ చేసుకున్నాడు . చిరంజీవి పొగడ్తలను పెద్దగా పట్టించుకోరని .. కానీ నిర్మాతకు మాత్రం రూపాయి నష్టం వచ్చినా..చాలా సీరియస్ అయిపోతాడని ..ఈ క్రమంలోని వేరే సినిమా షూటింగ్లో ఆయనని షాట్ కి పిలవకుండా మేనేజర్ ఇబ్బంది పడుతూ ఉంటే ..
“ఫస్ట్ టైం చిరంజీవికి కోపం వచ్చి.. చైర్ విసిరేసి..నీ బోర్డ్ పర్ఫామెన్స్ నా దగ్గర వద్దు.. ఇక్కడ తినే ఇడ్లీ కన్నా ..అక్కడ షాట్ ఇంపార్టెంట్ ” అంటూ ఫైర్ అయిపోయారని చెప్పుకొచ్చాడు. దీంతో మరోసారి మెగాస్టార్ చిరంజీవి పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది . మెగాస్టార్ చిరంజీవి ఇంతటి కమిట్మెంట్ ఉన్న వ్యక్తి కనుకనే మెగాస్టార్ అయ్యాడు అంటూ జనాలు పొగడేస్తున్నారు.