ఆరడుగు భారీ కాయం. చూడగానే ముచ్చటగొలిపే వర్ఛస్సు. చారడేసి నేత్రాలు.. లేత పెదవులు.. వెరసి.. అందమంతా పోతపోసి ఒక దగ్గరే కూర్చినట్టు కనిపించే పున్నమి వెన్నెల వంటి నటీమణి. ఆమే.. కేఆర్ విజయ. అనేకచిత్రాల్లో హీరోయిన్‌గా నటించిన ఆమె తమిళియన్ అన్న విషయం తెలిస్తే.. ఆశ్చర్యం తప్పదు. ఎందుకంటే.. ఆమె తెలుగు వాక్చాతుర్యం..డైలాగ్ డెలివరీ కూడా అదే రేంజ్‌లో ఉంటుంది.
ఇక, తమిళంలో నటించినా.. తమిళం మాతృభాష కాబట్టి.. దానిలో లీనమై పోయేవారు. ఇలా.. తెలుగు, తమిళ సినీ రంగాలను ఏలిన కేఆర్ విజయ.. అనేక చిత్రాల్లో నటించినా.. దేవతా పాత్రల్లో మాత్రం తనకు తానే సాటి మేటి అని అనిపించుకున్నారు. కనక దుర్గగా, శక్తిగా, కాళిగా, చాముండేశ్వరిగా, పార్వతిగా అనేక చిత్రాల్లో నటించారు. ఇక్కడ చిత్రం ఏంటంటే.. ఆమెకు ఎవరూ మేకప్ వేయాల్సిన అవసరం కూడా ఉండేదికాదట.
తన పాత్రలకు తనే మేకప్ వేసుకునేవారు. కేవలం ప్రొడక్షన్ మేనేజర్ దుస్తులు తెచ్చిస్తే.. చాలు. మేకప్ కిట్ అందిస్తే.. చాలట. ఇలా అనేక చిత్రాల్లో ఆమె నభూతో అన్నట్టుగా నటించారు. అయితే.. సాంఘిక పాత్రలకు, దేవతా పాత్రలకు మధ్య వైరుధ్యం చూపించిన కేఆర్ విజయ.. దేవతా పాత్రల్లోనే ఎక్కువగా రాణించారని చెప్పకతప్పదు. కేఆర్ విజయ కనకదుర్గ వేషం కట్టిందంటే.. ఇక, ఆ సినిమాకు మహిళలు క్యూ కట్టేవారు. దీంతో ఆ సినిమాలు.. వందల రోజులు ఆడిన సందర్భాలు ఉన్నాయి.
ఇక, ఈ క్రమంలోనే కేఆర్ విజయ ఆయా పాత్రలు వేసినందుకు లక్షల్లో రెమ్యునరేషన్ తీసుకునేవారట. ఇదే విషయాన్ని ఒక సందర్భంలో అప్పటి దర్శకుడు.. కోడి రామకృష్ణ ఉటంకించారు. విజయకు ఇచ్చే రెమ్యునరేషన్‌తో సగం సినిమా తీసేయొచ్చని అన్నారు.అ యినా.. ఆమెనే తీసుకుంటున్నామంటే.. ఆమెకు ఇమేజ్, ఫాలోయింగ్ అలాంటిదని చెప్పుకొచ్చారు. ఇదీ.. సంగతి..!