Movies"నిన్ను చాలా మిస్ అవుతున్నా".. ఊహించని ట్వీస్ట్ ఇచ్చిన కళ్యాణ్ దేవ్..!!

“నిన్ను చాలా మిస్ అవుతున్నా”.. ఊహించని ట్వీస్ట్ ఇచ్చిన కళ్యాణ్ దేవ్..!!

ఈ మెగా అల్లుడు మాజీ అవుతున్నాడో .. రాజీ అవుతున్నాడో తెలియదు కానీ .. సోషల్ మీడియాలో పెట్టే ప్రతి పోస్ట్ వైరల్ గా మాత్రం మారుతుంది . మనకు తెలిసిందే చిరంజీవి చిన్న కూతురు శ్రీజ రెండో భర్త నే ఈ కళ్యాణ్ దేవ్ . మొదటిగా ప్రేమించి పెళ్లి చేసుకున్న శ్రీజ కొన్ని కారణాల చేత ఆయనకి విడాకులు ఇచ్చి తర్వాత పెద్దలు చెప్పిన పెళ్లి చేసుకుంది. రెండో భర్త కళ్యాణ్ తో బుద్ధిగానే కాపురం చేసిన శ్రీజ .. ఆ తర్వాత ఒక బిడ్డకు జన్మనిచ్చింది . అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ ..మధ్యలోనే ఈ జంట విడిపోయారు .

దీనిపై ఇప్పటివరకు అఫీషియల్ గా ప్రకటించని శ్రీజ – కళ్యాణ్ దేవ్ ..అనఫీషియల్ గా మాత్రం దూరంగా ఉంటూ సోషల్ మీడియాలో అన్ ఫాలో చేసుకున్నారు . కాగా శ్రీజ – కళ్యాణ్ దేవ్ కి పుట్టిన బిడ్డ నే నవిష్క. వీళ్ళు విడిపోయిన తర్వాత శ్రీజ వద్దనే నవిష్క ఉంటుంది . అప్పుడప్పుడు సోషల్ మీడియాలో నవిష్కకు సంబంధించిన ఫోటోలు షేర్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది శ్రీజ. ఈ క్రమంలోనే రీసెంట్గా ఓ వీడియోను పోస్ట్ చేసింది . అయితే అందుకు “నేను నిను చాలా మిస్ అవుతున్నా” అంటూ కామెంట్ పెట్టాడు కళ్యాణ్.

అంతే కాదు మొదటినుంచి శ్రీజ కు దూరంగా ఉంటున్నా సరే ..నవిష్క ఫోటోలకు మాత్రం ఎమోషనల్ కామెంట్స్ పెడుతూ ఆమెను తలుచుకుంటూనే ఉన్నాడు కళ్యాణ్ దేవ్. ఈ క్రమంలోనే వీళ్లిద్దరూ మళ్ళీ కలిసే ఛాన్సెస్ ఉన్నాయా అంటూ కూడా మెగా ఫాన్స్ ఆశపడుతున్నారు. అయితే మొదటి విడాకులు తర్వాత ఎవరు ఊహించని విధంగా రెండో విడాకులు తీసుకొని శ్రీజ మెగా అభిమానులకు ఊహించిన షాక్ ఇచ్చింది . అంతేకాదు మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ దగ్గర నుంచి ఈ ట్వీస్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు మెగా ఫ్యాన్స్ . మెగా ఫ్యామిలీ అల్లుడు అయిన తర్వాతే ఇండస్ట్రీ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ..కొన్ని మర్యాదలు అందుకున్నాడు ..ఇలాంటి మర్యాదలను కాదు వద్దు అనుకొని శ్రీజ తో విడాకులు తీసుకోవాల్సిన అంత బాధ కళ్యాణ్ దేవ్ కి ఏమొచ్చిందో ..? అంటూ కొందరు అబ్బాయిలు అతగాడి పై జాలి చూపిస్తున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news