సినీరంగంలో వ్యాంపు క్యారెక్టర్లుగా రికార్డులు సృష్టించిన వారిలో అప్పటి తరానికి చెందిన వారు జయమాలిని, జ్యోతిలక్ష్మి. నిజానికి వీరిద్దరూ కూడా అక్కాచెల్లెళ్లు. ఈ విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. అంతేకాదు.. వీరి మధ్య ఆస్తి వివాదాలు కూడా కొనసాగాయి. ఇదిలావుంటే, ఇద్దరూకూడా సినీ రంగంలోకి రాకముందు.. నాటకాలు ఆడేవారు. జయమాలిని అక్క అయితే.. జ్యోతి లక్ష్మి చెల్లెలు.
ఆ తర్వాత.. సినీ రంగంలో ప్రవేశించిన తర్వాత ఇద్దరూ కూడా తమిళంలో అనేక సినిమాల్లో హీరోయిన్లుగా నటించారు. చాలా తక్కువ సినిమాల్లోనే అయినప్పటికీ.. మంచి పేరు తెచ్చుకున్నారు. అంతేకాదు.. ఇద్దరూ కూడా మంచి డ్యాన్సర్లు. కూడిపూడి, భరతనాట్యం వంటివాటిలో నిష్ణాతులుగా పేరు తెచ్చుకున్నారు. ఒకప్పటి ఈస్టమన్ కలర్ చిత్రాల్లో వచ్చిన పౌరాణిక సినిమాల్లో వీరి నృత్యాలు అందరినీ అలరించాయి.
అయితే.. అనూహ్యంగా కొందరు నిర్మాతలు చేసిన వ్యవహారంతో వీరు హీరోయిన్ ట్రాక్ నుంచి సైడ్ అయిపోయారు. ఇక, కుటుంబాలు గడవని పరిస్థితికి వచ్చేసరికి.. కొందరు దర్శకులు.. మరికొందరు నిర్మాతలు వీరిని వ్యాంపు పాత్రలకు బుక్ చేసుకున్నారు. దీంతో అప్పటి నుంచి వ్యాంపు క్యారెక్టర్లకు మారిపోయారు. ఇలా కూడా పలు సినిమాల్లో నటించి పేరు తెచ్చుకున్నారు. కొన్నాళ్లకు.. కేవలం పాటలకు మాత్రమే పరిమితం అయ్యారు.
జ్యోతి లక్ష్మి అయితే.. ఏకంగా పాటలకే పరిమితం అయిన సినిమాలు ఉంటే.. జయమాలిని మాత్రం కొన్ని సినిమాల్లో హీరోయిన్‌గా సైడ్ హీరోయిన్‌గా కూడా నటించిన సినిమాలు ఉన్నాయి. ఎలాచూసుకున్నా.. హీరోయిన్ల కంటే కూడా వీరు వ్యాంపు పాత్రల్లోనే ఎక్కువగా ప్రజలకు గుర్తుండిపోయారు. ఆరు అడుగుల హైట్.. ముఖ వర్ఛస్సు వంటివి వీరికి కలిసి వచ్చాయి. అదే సమయంలో ఇద్దరూకూడా మద్యానికి అలవాటు పడ్డారు. దీంతో ఆస్తులు అమ్ముకునే పరిస్థితి వచ్చింది.
ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకునే స్థాయికి దిగజారారు. చివరకు సినిమాలు కూడా దూరమయ్యాయి. ఒకప్పుడు.. కార్లలో తిరిగిన జయమాలిని.. తర్వాత కాలంలో ఆటోలకు, రిక్షాలకు కూడా పరిమితం అయ్యారు. జ్యోతి లక్ష్మి పరిస్థితి కూడా అలానే తయారైంది. అన్నగారు ఎన్టీఆర్ సినిమాల్లో ఎక్కువగా ఐటం సాంగ్స్‌లో వీరు కనిపించేవారు.
వీరు లేకుండా ఒక్క సినిమా కూడా లేని పరిస్థితి ఒక దశాబ్ద కాలం సాగిందంటే.. వీరి రేంజ్ ఏంటో అర్థమవుతుంది. కానీ, ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం.. కొన్ని వ్యసనాలకు అలవాటు పడడం వంటివి వీరిని జీవితంలో కోలుకోలేకుండా చేశాయి. ప్రస్తుతం వీరి పరిస్థితి దారుణంగా ఉందని.. ఇటీవల ఒక తమిళనాడు పత్రికలో వార్తలు రావడం గమనార్హం.