Moviesరాజ‌బాబు - ర‌మాప్ర‌భ మ‌ధ్య నిజంగానే ఎఫైర్ ఉందా... సాక్ష్యాలు ఇవే...!

రాజ‌బాబు – ర‌మాప్ర‌భ మ‌ధ్య నిజంగానే ఎఫైర్ ఉందా… సాక్ష్యాలు ఇవే…!

ఒక‌ప్ప‌టి సినిమాల్లో.. ముఖ్యంగా బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో రాజ‌బాబు క‌నిపిస్తే చాలు.. ప్రేక్ష‌కులు క‌డుపుబ్బ న‌వ్వుకునేవారు. ఆయ‌న సినిమాలో ఉంటే.. చాలు కుటుంబాల‌కు కుటుంబాలు క్యూ క‌ట్టుకుని సినిమా హాళ్ల‌కు వెళ్లిపోయేవారు. ఈస్ట్‌మ‌న్ క‌ల‌ర్ మూవీల్లోనూ రాజ‌బాబు న‌టించినా.. బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో వ‌చ్చిన పేరు క‌ల‌ర్ మూవీల్లోకి వ‌చ్చే స‌రికి రాలేదు. ఇదిలావుంటే.. సినీ రంగంలో ఉన్న‌వారికి రూమ‌ర్లు ఎక్కువ‌గా ఉంటాయి. అది నిజ‌మో కాదో తెలియ‌దుకానీ… ప్ర‌చారంలోకి మాత్రం వ‌చ్చేస్తాయి.

ఇలానే.. రాజ‌బాబు.. ఒక‌ప్ప‌టి క్యారెక్ట‌ర్ న‌టీమ‌ణి ర‌మాప్ర‌భ విష‌యంలోనూ అనేక రూమ‌ర్లు హ‌ల్చ‌ల్ చేశాయి. అప్ప‌టికే ర‌మా ప్ర‌భను అప్ప‌టి క్యారెక్ట‌ర్ ఆర్టిస్టు.. శ‌ర‌త్‌బాబు పెళ్లి చేసుకున్న విష‌యం తెలిసిందే. ఇద్ద‌రు కూడా ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నా రు. ఇద్ద‌రి పెళ్లీ కూడా.. ఇండ‌స్ట్రీలోనే జ‌ర‌గ‌డం విశేషం. ఇదిలావుంటే.. శ‌ర‌త్‌బాబు కు పెళ్లి అయిన త‌ర్వాత‌.. ఆఫ‌ర్లు త‌గ్గిపోయాయి. దీంతో ర‌మాప్ర‌భకు వ‌చ్చిన సంపాద‌న‌తోనే కుటుంబం గ‌డిచేది. ఇద్ద‌రికీ పిల్ల‌లు లేర‌ని స‌మాచారం.

ఇక‌, ఇలా.. సినిమాల్లో బిజీగా ఉన్న స‌మ‌యంలోనే రాజ‌బాబుతో ర‌మాప్ర‌భ‌కు ప‌రిచ‌యం ఏర్ప‌డింద‌ని అంటారు. ఇక‌, రాజ‌బాబుకు కూడా అప్ప‌టికే వివాహం అయింది. మ‌హాక‌వి శ్రీశ్రీ-రాజ‌బాబు ఇద్ద‌రూ కూడా ఒకింటి ఆడ‌ప‌డుచుల‌నే పెళ్లి చేసుకున్నారు. అంటే ఇద్ద‌రూ కూడా తోడ‌ళ్లుళ్ల‌న్న‌మాట‌. అనేక చిత్రాల్లో క‌లిసి కూడా ప‌నిచేశారు. ఈ క్ర‌మంలోనే రమాప్ర‌భ‌తో రాజ‌బాబు ప‌రిచ‌యం.. ప్రేమ‌గా మారింద‌నే టాక్ ఇప్ప‌టికీ గ‌త చిత్రాల నాయ‌కుల మ‌ధ్య చ‌ర్చ‌కువ‌స్తూ ఉంటుంది.

ఇద్ద‌రూ క‌లిసి ఊటీలో తిరిగార‌ని.. అక్క‌డ కొన్నాళ్లు ఉన్నార‌ని కూడా పెద్ద చ‌ర్చ ఉండేది. ఇదే.. శ‌ర‌త్ బాబును, ర‌మాప్ర‌భ‌ను దూరం చేసింద‌ని అంటారు. త‌ర్వాత‌.. ఇద్ద‌రూ విడిపోయారు. అయితే.. అప్ప‌టికి ర‌మాప్ర‌భ విష‌యం రాజ‌బాబు ఇంట్లో తెలియ‌డంతో ఆయ‌న కూడా చిక్కుల్లో ప‌డ్డార‌ని.. ఈ క్ర‌మంలో మ‌ద్యానికి మ‌రింత బానిస‌య్యార‌ని ఇండ‌స్ట్రీలో వినిపించింది.

మొత్తానికి ఇద్ద‌రూ చేరువ అయ్యారో.. లేదో ఇత‌మిత్థంగా తెలియ‌క‌పోయినా.. రాజ‌బాబు-ర‌మాప్ర‌భ‌ల వ్య‌వ‌హారం మాత్రం ఇండ‌స్ట్రీలో పెద్ద ఎత్తున క‌థ‌నాలుగా కూడా వ‌చ్చాయి. ప్ర‌స్తుతం రాజ‌బాబు లేరు. ర‌మాప్ర‌భ‌.. చిత్తూరులో ఒంట‌రిగా ఉంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news