ఈ సంక్రాంతికి ఇద్దరు టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలతో పోటీ పడుతోంది కోలీవుడ్ విజయ్ వారసుడు సినిమా. మామూలుగా వారసుడు సినిమాను ఎవ్వరూ పట్టించుకోరు. అయితే ఈ సినిమాను నిర్మిస్తోంది మన అగ్ర నిర్మాత దిల్ రాజు.. మన తెలుగు డైరెక్టర్ వంశీ పైడిపల్లి. దిల్ రాజు టాలీవుడ్‌లో చాలా వరకు ఇండస్ట్రీని, ఇటు థియేటర్లను, అటు పెద్ద హీరోలను కూడా శాసిస్తూ వస్తున్నాడన్నది నిజం.
అందుకే ఇప్పుడు ఆయన కంట్రోల్లోనూ, ఆయన డిస్ట్రిబ్యూటర్ల కంట్రోల్లో ఉన్న థియేటర్లు అన్నీ కూడా వారసుడి సినిమాకు పక్కాగా ఫిక్స్ అయిపోయాయి. దీంతో బాలయ్య వీరసింహారెడ్డి, చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాకు అనుకున్న స్థాయిలో థియేటర్లు దొరకవు. సింగిల్ స్క్రీన్లు ఉన్న దగ్గర ఇబ్బందులే ఉన్నాయి. దీంతో చిరు, బాలయ్య ఫ్యాన్స్‌కు దిల్ రాజు మీద కోపం పీకల దాకా ఉంది.
పైగా రాజు ఇక్కడ జరిగేది వ్యాపారం.. తన సినిమా ఉన్నప్పుడు తన సినిమా కాకుండా మరో నిర్మాతల సినిమాలకు తాను ఎలా ? థియేటర్లు ఇస్తానని ఓపెన్‌గానే చెప్పేశారు. రాజుపై చిరు, బాలయ్య ఫ్యాన్స్ ఉడికిపోతోన్న టైంలో ఆయన నిర్మించిన వారసుడు ట్రైలర్ వచ్చింది. ట్రైలర్ చూసిన వారంతా తెలుగులో మాత్రం ఇది పక్కా రాడ్ రంబోలా అని ఆడేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ ట్రోలింగ్ మామూలుగా లేదు.
వారసుడు ట్రైలర్ ఐదు తెలుగు సినిమాల మిక్సింగ్ అంటున్నారు. బ్రహ్మోత్సవం + అల వైకుంఠపురములో + అత్తారింటికి దారేది + మహర్షి + బృందావనం + అజ్ఞాతవాసి ఇలా చాలా సినిమాలను మిక్స్ చేసి తీసిన జ్యూస్ అంటున్నారు. వారసుడు అంటే ఎక్కడో ఉంటాడు.. తన ఫ్యామిలీ కష్టాల్లో ఉంటే ఒక చోటకు వెళతాడు.. అక్కడ హీరోయిన్ పరిచయం.. ఆ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టే విలన్‌ను ఎదుర్కోవడం.. ఇక్కడ అతడు, అత్తారింటికి దారేది సినిమాల పోలికలు కూడా కనిపిస్తున్నాయి.
ఓవరాల్‌గా ట్రైలర్ చూస్తుంటే రొటీన్ సినిమా అన్నది అర్థమవుతోంది. అటు దిల్ రాజు మాటలు చూస్తుంటే మాత్రం కోటలు దాటిపోతున్నాయి. ట్రైలర్‌కు మించి కొత్తదనం ఉంటుందన్నది కూడా అత్యాశే. ఎందుకంటే వంశీ పైడిపల్లి ఎంత కొత్త ఇచ్చినా చాలా పాతగా తీయడం అలవాటు చేసుకున్నాడు. యాక్షన్ కూడా పరమ రొటీన్, రాడ్‌గానే ఉంటుంది. ఇప్పుడు వారసుడుతోనూ మరో రాడ్ దింపేస్తున్నాడనే టాక్ వచ్చేసింది. ఏదేమైనా వారసుడు ట్రైలర్‌తో మాత్రం తెలుగు సినీ జనాలు ఓ ఆటాడుకుంటున్నారు.