అన్నగారు ఎన్టీఆర్ నటించిన అనేక చిత్రాల్లో ఆయన సరసన నటించిన వారు ఎంతో మంది ఉన్నారు. అయితే.. కన్నాంబ వంటి మహానటులు.. మాత్రం ఆయనకు తల్లిగానో.. వదిన గానో.. అక్కగానో నటించారు. నిజానికి కన్నాంబ హీరోయిన్. ఆమె చిత్రాలంటే కుటుంబాలకు కుటుంబాలే కదిలేవట. అప్పట్లో ఆమెను కొట్టేసే హీరోయినే లేరు. ఆమె దర్శకుడు పుల్లయ్యను వివాహం చేసుకున్నారు.
అంత పేరున్న ఆమె.. ఎన్టీఆర్ హయాం వచ్చేసరికి.. గౌరవంగా ఆ పాత్రలకు స్వస్తి చెప్పారు.
`ఇక.. చాలు! నేటి తరం నన్ను చూసి హీరోయిన్‌గా ఇష్టపడదు..!` అని నిర్ణయించుకున్న కన్నాంబ.. హీరో యిన్‌గా మంచి ఫామ్‌లో ఉన్నప్పుడే.. సినిమాల్లో కీలకమైన క్యారెక్టర్ పాత్రలను ఎంచుకుని.. ముందుకు సాగారు. ఆ పాత్రల్లోనూ ఆమె ఇమిడిపోయారు. ఇది ఆమెకు మంచి పేరు తెచ్చింది. అంతేకాదు.. ఎలాంటి సినిమాల్లో అయినా.. కన్నాంబ ఉండాల్సిందే.. అనే పేరు వచ్చేలా చేసింది.
ఇలా అక్కినేని నాగేశ్వరరావు, అన్నగారి సినిమాల్లో వదిన, తల్లి, అక్క వంటి పాత్రలే కాకుండా ప్రతినాయ కి పాత్రల్లోనూ కన్నాంబ నటించారు. కన్నాంబకు అప్పట్లో పెద్ద స్టూడియో సొంతంగా ఉండేది. ఈ బిజీలో ఉండి.. ఒక్కొక్కసారి ఆమె షూటింగులకు ఆలస్యమయ్యేవారట. పైగా.. ఆమె భర్త కూడా అసిస్టెంట్ దర్శకుడే. దీంతో వారే చిత్రాలు నిర్మించిన సందర్భాలు ఉండేవి.
ఇక, కొన్ని కొన్ని చిత్రాల్లో కన్నాంబ నేరుగా వచ్చి షూటింగ్‌లో పాల్గొనే వారట. డైలాగ్ షీట్‌ను చూసి.. సందర్భం తెలుసుకుని.. తనే సొంతగా మాట్లాడేవారట. అంటే.. రచయిత రాసిన డైలాగులను కూడా ఆమె చదివేవారు కాదట. ఇవి సినిమాలకు అచ్చుగుద్దినట్టు సరిపోయేవట.
ఈ గుమ్మడి వెంకటేశ్వరరావు రాసుకున్న తీపిగురుతులు పుస్తకంలో స్పష్టంగా పేర్కొన్నారు. అంతేకాదు.. చాలా సినిమాల్లో కన్నాంబ అసలు మేకప్ కూడా వేసుకోలేదని.. ఈ విషయాన్ని అన్నగారు.. అడిగేవారని.. దీనికి దర్శకులు.. చందమామకు మేకప్ ఎందుకయ్యా! అని సరిపుచ్చేవారని గుమ్మడి చెప్పేవారట. ఇదీ.. సంగతి!