తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరుకి ఎలాంటి క్రేజ్ , రేంజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందరూ అభిమానులు తమ హీరోని స్టార్ హీరోగా చూస్తుంటే ..పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం పవన్ కళ్యాణ్ ను ఓ దేవుడిలా భావిస్తారు . ఆయన చెప్పిన పనులను తూ చా తప్పకుండా చేస్తూ .. ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు స్పెషల్ క్రేజ్ తీసుకొచ్చారు .
అయితే పవన్ కళ్యాణ్ తో సినిమా అవకాశం రావాలని.. ఆయనతో కనీసం స్క్రీన్ షేర్ చేసుకునే ఛాన్స్ వచ్చిన సంబరపడిపోయే ముద్దుగుమ్మలు ఎంతోమంది ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ తో సినిమా చేసే అవకాశం వచ్చిన సరే చచ్చినా చేయను అంటూ స్ట్రాంగ్ గా కామెంట్స్ చేసింది యంగ్ బ్యూటీ ప్రియాంక జవల్కర్ . దీంతో ఒక్కసారిగా పవన్ ఫ్యాన్స్ షాక్ అయిపోయారు . అయితే ఆమె పవన్ కళ్యాణ్ కు బిగ్ ఫ్యాన్ అని ..ఎప్పటికి నేను ఆయనకు అభిమాని గానే ఉండాలనుకుంటున్నానని క్లారిటీ ఇచ్చింది.
“ఆయనతో కలిసి నటించే అవకాశం వచ్చిన సరే నేను దూరం నుండి ఆయనను చూసి ఆనందిస్తానే తప్పిస్తే ..ఆయనతో కలిసి నటించనని ..పవన్ కళ్యాణ్ అభిమాని గానే తాను ఎప్పటికీ ఉంటానని “చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోనే కొందరు ప్రియాంక జవల్కర్ మెంటల్ అంటూ ట్రోల్ చేస్తుంటే ..మరికొందరు రియల్ పవన్ ఫ్యాన్ అంటూ టాగ్ చేస్తున్నారు . ఏది ఏమైనా సరే ప్రియాంక జవల్కర్ కూసింత ఓవర్గానే బీహేవ్ చేసింది అన్నది సోషల్ మీడియాలో టాక్..!!