Moviesఉదయ్ కిరణ్ కి "మనసంతా నువ్వే" ఆఫర్ ఎలా వచ్చిందో తెలుసా..తెర...

ఉదయ్ కిరణ్ కి “మనసంతా నువ్వే” ఆఫర్ ఎలా వచ్చిందో తెలుసా..తెర వెనుక ఇంత జరిగిందా..?

సినిమా ఇండస్ట్రీ లోకి ఎంత త్వరగా వచ్చి స్టార్ గా మారాడో.. అంతే త్వరగా పతనం అయిపోయి కనుమరుగు అయిపోయాడు టాలీవుడ్ యంగ్ హీరో గా పేరు సంపాదించుకున్న ఉదయ్ కిరణ్. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఇప్పటికీ ఈ పేరు చెప్తే కళ్ళల్లో నీళ్లు మనకు తెలియకుండానే వచ్చేస్తాయి . అంతలా జనాలను బాధపెట్టి మరి సూసైడ్ చేసుకున్నాడు ఉదయ్ కిరణ్ . ఎస్ ఎవరు అవునన్నా కాదన్నా ఉదయ్ కిరణ్ చావుకు బాధ్యులు సినిమా ఇండస్ట్రీనే అన్నది నగ్నసత్యం .

కాగా చిత్రం సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టిన ఉదయ్ కిరణ్ .. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు . ఇక ఆ తర్వాత అదృష్టం ఆయనను వరించింది మంచి మంచి ప్రాజెక్ట్లు అవకాశాలు వచ్చాయి . తీసిన ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది . అప్పట్లో ఉదయ్ కిరణ్ పేరు చెప్తే కాలేజీ అమ్మాయిలు ఓ రేంజ్ లో ఊగిపోయేవాళ్ళు . కాగా ఉదయ్ కిరణ్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచిన మనసంతా నువ్వే కూడా ఆయన క్రేజ్ ని డబల్ చేసింది .

ఈ సినిమా కంటే ముందు ఉదయ్ కిరణ్ చిత్రం , నువ్వు నేను వంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలో నటించాడు .అయితే నిజానికి మనసంతా నువ్వే సినిమాలో హీరోగా అనుకునింది వేరే టాలీవుడ్ హీరో నట . ఈ సినిమాను మహేష్ బాబు తో చేయాలని సినిమా డైరెక్టర్ అనుకున్నారట అయితే డైరెక్టర్ ఆదిత్య స్టోరీని మొదటిగా మహేష్ బాబుతో చేద్దామని అనుకొని కథ చెప్పగా మహేష్ బాబుకు కథ పెద్దగా నచ్చకపోవడంతో సింపుల్గా రిజెక్ట్ చేశారట . దాంతో ఈ సినిమా స్టోరీ ను ఇద్దరు ముగ్గురు హీరోలకి చెప్పినా సరే వాళ్లు పెద్దగా అట్రాక్ట్ అవ్వలేదట .

ఫైనల్ గా ఉదయ్ కిరణ్ ఈ సినిమా కథను విని ఓకే చేశాడట . ఒకవేళ మహేష్ బాబు ఓకే చెప్పుంటే కచ్చితంగా ఉదయ్ కిరణ్ చేతికి ఈ సినిమా వచ్చేది కాదు . ఇంత పాపులారిటీ దక్కించుకునే వాడు కాదు ..అయినా ఏం లాభం నూరేళ్ల జీవితం సగంలోనే అర్ధాంతరంగా ముగిసిపోయింది. ఇప్పటికి ఉదయ్ కిరణ్ చావు ఇండస్ట్రీలో మిస్టరీగానే ఉంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news