Moviesమహేష్ తో సినిమా తర్వాత.. రాజమౌళి చేయబోయే హీరో ఇతనే..బాక్స్ బద్ధలవ్వల్సిందే.!?

మహేష్ తో సినిమా తర్వాత.. రాజమౌళి చేయబోయే హీరో ఇతనే..బాక్స్ బద్ధలవ్వల్సిందే.!?

టాలీవుడ్ దర్శకు ధీరుడు రాజమౌళి పేరు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . తెలుగు సినిమా చరిత్రను ప్రపంచ దేశాలకు పాకేలా చేసి ఇండియన్ ఫిలిం అంటే ఏంటో ప్రపంచ దేశాలకు ప్రూవ్ చేసాడు . మరి ముఖ్యంగా ఆయన తెరకెక్కించిన బాహుబలి సినిమాతో తన పేరును మరింత పాపులారిటీ దక్కించుకున్న రాజమౌళి .. ప్రెసెంట్ ఆర్ఆర్ఆర్ సినిమా ఇచ్చిన సక్సెస్ మూడ్లో ఉన్నారు .

రీసెంట్గా ఈ సినిమా ఆస్కార్ కి నామినేట్ అయింది . దీంతో దేశం మొత్తం ఆర్ఆర్ఆర్ సినిమా గురించి చర్చించుకుంటున్నారు. కాగా త్వరలోనే రాజమౌళి మహేష్ బాబుతో తెరకెక్కించబోయే సినిమా షూట్ ను ప్రారంభించబోతున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తి చేసుకున్న రాజమౌళి ..మహేష్ బాబు – త్రివిక్రమ్ సినిమా పూర్తి అవ్వగానే ఈ సెట్స్ లో కనువిందు చేయనున్నాడు.

కాగా మహేష్ బాబు తో సినిమా అయిపోయిన వెంటనే రాజమౌళి మరోసారి ప్రభాస్ తో సినిమా చేయనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . బాహుబలి పార్ట్ త్రి తీసేసి కొన్నాళ్లపాటు సినిమా ఇండస్ట్రీకి బ్రేక్ వేయాలని రాజమౌళి ఆలోచిస్తున్నాడట . బాహుబలితో రాజమౌళి ఎలాంటి క్రేజ్ సంపాదించుకున్నాడో తెలిసిందే. ఇక బాహుబలి పార్ట్ త్రి అంటే మాత్రం బాక్సాఫీస్ బద్దలు అవ్వాల్సిందే అంటూ జనాలు ఓ రేంజ్ లో రాజమౌళిని పొగడేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news