దిల్ రాజు టాలీవుడ్ డిస్ట్రిబ్యూషన్‌లో తనదై పై చేయి కావాలని చాపకింద నీరులా ప్లాన్లు వేస్తుంటాడన్న టాక్ ఇప్పటికే ఉంది. సంక్రాంతి సినిమాల్లో వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాల కంటే కూడా తన థియేటర్లు అన్నింటిని తన వారసుడు సినిమాకే ఇస్తానని ఆయన ఇప్పటికే నొక్కి మరీ చెపుతున్నారు. ఇక్కడ ఉన్నదంతా బిజినెస్.. ఎవరి ఇష్టం వచ్చిన థియేటర్లు వాళ్లు వేసుకుంటారని చెప్పారు.
అసలు ఇంత పోటీ ఉన్నా మైత్రీ వాళ్లు ఇప్పటి వరకు తమకు థియేటర్లు కావాలని అడగనే లేదని కూడా ఆయన తాజా ఇంటర్వ్యూలో చెప్పారు. ఓవరాల్‌గా తన సినిమా ఉన్నప్పుడు అటు వైపు బాలయ్య, చిరంజీవి సినిమాలు ఉన్నా కూడా తాను ఎందుకు థియేటర్లు ఇవ్వాలన్న ప్రశ్న లేవనెత్తారు. నైజాంలో మైత్రీ వాళ్లు డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ ఓపెన్ చేయడంతో వాళ్లకు చెక్ పెట్టాలనే రాజు ఇదంతా చేస్తున్నారన్న గుసగుసలు ఇండస్ట్రీ వర్గాల్లో ఉన్నాయి.
నిజానికి మైత్రీ టాలీవుడ్‌లో ఇప్పుడు బడా నిర్మాణ సంస్థ. ఇంకా చెప్పాలంటే దిల్ రాజును మించి వరుసగా స్టార్ హీరోలతో అదిరిపోయే కాంబినేషన్లు సెట్ చేస్తూ సినిమాలు నిర్మిస్తోంది. పైగా ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్లోకి కూడా ఎంటర్ అయితే రాజు ప్రాభవం ఎంతైనా తగ్గుతుంది. అందుకే రాజు ఎలెర్ట్ అయ్యి సంక్రాంతిక వస్తోన్న మైత్రీ వాళ్ల సినిమాలకు తన థియేటర్లు ఇవ్వకుండా కథ నడిపిస్తున్నారే అంటున్నారు. ఇక అది ఆయన కోణంలో బిజినెస్.
ఇక ఇప్పుడు దిల్ రాజు మరిన్ని పెద్ద నిర్మాణ సంస్థలను కూడా టార్గెట్ చేసినట్టు ప్రచారం నడుస్తోంది. ఆయన రిలీజ్ చేస్తోన్న శాకుంతలం సినిమాను ఫిబ్రవరి 17న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే అదే డేట్‌కు సితార సంస్థ నిర్మించిన ‘సర్’ సినిమా. ఇందులో ధనుష్ హీరో, వెంకీ అట్లూరి దర్శకుడు – ఇక రెండోది విష్వక్ సేన్ ‘ధమ్కీ’. దీనికి దర్శకుడు..నిర్మాత రెండూ విష్వక్ సేన్ కావడం విశేషం.
ఇక మూడోది గీతా సంస్థ నిర్మిస్తోన్న ‘వినరో భాగ్వము విష్ణు కథ’ బన్నీ వాస్ నిర్మాత. ఇందులో సితార, గీతా లాంటి రెండు పెద్ద సంస్థల సినిమాలు ఉన్నాయి. పైగా ఇవి ఎప్పుడో రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేశారు. మరో ట్విస్ట్ ఏంటంటే ఈ మూడు సినిమాలు కూడా దిల్ రాజు పంపిణీవి కాదు. అంటే రాజు కావాలనే గీత, సితారకు చెక్ పెట్టే ఉద్దేశంతో ఇప్పటికిప్పుడు శాకుతలం సినిమా రిలీజ్ డేట్ ఫిబ్రవరి 17కే వేశారన్న ప్రచారం ఇండస్ట్రీలో నడుస్తోంది. ఏదేమైనా ఇప్పుడు టాలీవుడ్ దిల్ రాజు – యాంటీ దిల్ రాజు గ్రూపులుగా విడిపోతోందనే అంటున్నారు.