మన సౌత్ సినిమా ఇండస్ట్రీలో బక్కపలచని భామ రకుల్ ప్రీత్ సింగ్‌కి ఉన్న క్రేజ్ ఏంటో అందరికీ తెలిసిందే. కెరీర్ ప్రారంభంలోనే వరుసగా మంచి హిట్ సినిమాలు పడటంతో స్టార్ హీరోలతో నటించే అవకాశాలను అందుకుంది. ఇలియానా తర్వాత అంత త్వరగా కోటి రూపాయల రెమ్యూనరేషన్ అందుకుందీ అంటే రకుల్ ప్రీత్ సింగ్ అని చెప్పాలి.
ఒకదశలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించే సినిమాలో ఛాన్స్ వస్తే కూడా ఏమీ చేయలేకపోయింది. డేట్స్ సరుబాటు చేయలేక మహేష్ బాబు లాంటి స్టార్ హీరోల సినిమాలను వదులుకుంది రకుల్ ప్రీత్ సింగ్. ఆ తర్వాత అదే మహేష్‌తో స్పైడర్ సినిమా చేసింది. రామ్‌చరణ్‌తో అయితే బ్యాక్ టు బ్యాక్ వరుసగా బ్రూస్లీ, ధృవ సినిమాలు చేసింది.
ఎన్టీఆర్‌తో నాన్నకు ప్రేమతో, బన్నీతో సరైనోడు, సాయిధరమ్‌తో విన్నర్ ఇలా వరుస పెట్టి సినిమాలు చేసుకుంటూ పోయింది. ఇంత బిజీ హీరోయిన్ గత రెండేళ్ళుగా టాలీవుడ్లో అవకాశా అవకాశాల కోసం ఆవురావురంటోంది. ఒకప్పుడు తెలుగులో సినిమాలు చేస్తూ తమిళం, హిందీ భాషలలో అవకాశాలు వచ్చినా డేట్స్ అడ్జెస్ట్ చేయలేక వదిలేసింది.
అదే సమయంలో నేషనల్ ఇంటర్నేషనల్ యాడ్ ఫిలింస్ వచ్చినా చేయలేకపోయింది. కానీ, ఇప్పుడు కమర్షియల్ యాడ్ ఫిలింస్ హిందీ సినిమాలతో చాలా బిజీగా ఉంది. ఈ క్రమంలోనే ఓ కాండోమ్ యాడ్ చేసింది. ఇది ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది. టెలివిజన్‌లోనూ ప్రసారమవుతోంది.
ఇదంతా బాగానే ఉంది గానీ, కాండోమ్ యాడ్ చేయడం వల్ల ఇప్పటి వరకూ మీకు ఎన్నీ సార్లు శృంగారంలో అనుభవం ఉంది..అని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు, మీలాంటి సెలబ్రిటీ ఇలాంటి యాడ్స్ చేస్తే యూత్ చాలావరకూ పాడవుతుందని ఇకపై ఇలాంటి యాడ్స్ చేయవద్దని సలహాలిస్తున్నారు.