ఇన్నాళ్లు ప్రభాస్ గురించి ఏం తెలుసుకున్నారో తెలియదు కానీ కేవలం రెండే రెండు ఎపిసోడ్లలో రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ఫాన్స్ బోలెడన్ని విషయాలు తెలుసుకున్నారు. రీసెంట్గా బాలయ్య హోస్ట్ చేసిన అన్ స్టాపబుల్ షో కి రెబల్ స్టార్ ప్రభాస్ గెస్ట్ గా వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే దీనికి సంబంధించిన రెండు ఎపిసోడ్లు ఆహాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి . రెండు ఎపిసోడ్లో కూడా బ్లాక్ బస్టర్ అయ్యాయి. మొదటి ఎపిసోడ్ కి ఏకంగా 24 గంటల్లోనే 100 మిలియన్ క్రాస్ చేసి సంచలనాన్ని క్రియేట్ చేసింది .
కాగా రీసెంట్ గా సెకండ్ ఎపిసోడ్ కూడా ఆహాలు స్ట్రీమింగ్ అవుతుంది . ప్రభాస్ విషయంలో ఇంట్రెస్టింగ్ మ్యాటర్ కని పెట్టారు. సినిమాలో రొమాంటిక్ లుక్స్ లో ఫిల్ అవుట్ అవుతూ చలాకీగా కనిపించే ప్రభాస్ ..తన వెనుక మాత్రం చాలా సిగ్గుపడుతూ భయం భయంగా బిక్కుబిక్కున ఉంటాడని కనిపెట్టేశారు. ఈ విషయాన్ని ఆన్ స్టాపబుల్ షో లో క్లియర్ గా చూడొచ్చు. బాలకృష్ణ ఎలాంటి ప్రశ్న అడిగినా సరే సోషల్ మీడియాకు భయపడుతూ ఆ ప్రశ్న నుండి తప్పించుకోవడానికి చూశాడే.. కానీ ఆ ప్రశ్నకు సమాధానం ఇచ్చి ఆ ప్రాబ్లం ని అక్కడితో సాల్వ్ చేద్దామని ఆలోచించలేకపోయాడు .
మరీ ముఖ్యంగా ఎపిసోడ్ 2 లో బాలకృష్ణ కృతి సనన్..అనుష్క శెట్టి ఫోటోలను చూపించి ఈ ఇద్దరితో ఎవరితో డేటింగ్ అన్న వార్తలను వింటే నీకు నవ్వొస్తుంది అని అడగ్గా.. ప్రభాస్ అక్కడ ఇద్దరి పేర్లు చెప్పి తనపై వస్తున్న రూమర్స్ ని కొట్టి పడేయొచ్చు ..కానీ ఎవరి పేరు చెప్పకుండా తనలో తానే నవ్వుకుంటూ ఆ ప్రశ్న నుంచి స్కిప్ చేయడానికి ప్రయత్నించాడు. ఇదే క్రమంలో సోషల్ మీడియాలో కొత్త డౌట్లు పుట్టుకొస్తున్నాయి . నిజంగానే ప్రభాస్ ఇద్దరిలో ఒకరిని పెళ్లి చేసుకోబోతున్నాడా..? అందుకే ఆ ప్రశ్న నుంచి స్కిప్ చేశాడా ..?అంటూ కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి .
అంతేకాదు ప్రభాస్ ఎలాంటి తప్పు చేయకపోతే ఆ ప్రశ్నకి ఆన్సర్ ఇచ్చి చేతులు దులుపు వేసుకొని ఉండొచ్చు . అంతేకాదు గోపీచంద్ ని ప్రశ్న అడిగేటప్పుడు మన డార్లింగ్ చాలా యాక్టివ్ గా సరదా సరదాగా కనిపించాడు .అదే ఆయన విషయానికి వచ్చేసరికి మాత్రం ఒళ్లంతా చెమటలు పడుతూ.. సార్ సార్ అంటూ చేతులు కట్టుకొని చెమటలు తుడుచుకుంటూ కనిపించాడు . దీంతో ప్రభాస్ తెరవెనక ఏదో ఒక కహాని నడుపుతున్నాడని అందుకే ఈ రేంజ్ లో భయపడుతున్నాడని సోషల్ మీడియాలో సరికొత్త చర్చ ఇంట్రెస్టింగ్ నడుస్తుంది..!!