ప్రజెంట్ ఏపీలో సిచువేషన్ ఎలా ఉందో అందరికీ తెలిసిందే. కొద్ది గంటల ముందే మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ యువమంగళం పేరిట పాదయాత్రను ప్రారంభించారు . ఎప్పటినుంచో పాదయాత్రను చేయాలనుకున్న లోకేష్ నేడు పాదయాత్రను చిత్తూరు జిల్లా కుప్పంలోని లక్ష్మీపురం లో ఉన్న శ్రీ వరదరాజ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మరి ఉదయం 11 గంటల మూడు నిమిషాలకు ఆయన పాదయాత్ర ప్రారంభించారు. కాగా పాదయాత్ర కార్యక్రమంలో భాగంగా ఆయనతో తారకరత్న కూడా పాల్గొన్నారు .
కాగా ఎవరు ఊహించని విధంగా లోకేష్ యువమంగళం పాదయాత్రలో అపశృతి చోటు చేసుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . ఈ క్రమంలోనే అక్కడే ఉన్న తారక రత్న అస్వస్థకు గురయ్యారని తెలుస్తుంది . అంతేకాదు సెకండ్స్ లోనే పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చిన పోలీసులు తారకరత్నను వెంటనే అక్కడున్న కేసి ఆసుపత్రికి తరలించారు . చికిత్స అనంతరం ఆయన పరిస్థితి క్రిటికల్ గా మారడంతో వైద్యులు, హుటాహుటిన బెంగళూరుకి తరలించారని తెలుస్తుంది . అయితే తారకరత్న స్పృహ తప్పలేదని ఆయన పై విష ప్రయోగం జరిగిందని చెప్పుకొస్తున్నారు టిడిపి నేతలు . దీనికి కారణం ఆయన బాడీ నీలం రంగులో కి మారడమే కారణం అంటూ తెలుస్తుంది.
యాత్ర ప్రారంభించే ముందు తీర్థప్రసాదాలు తీసుకున్నారని ఆ కారణంగానే తారకరత్న పల్స్ పడిపోయిందని .. ఆయన కండిషన్ క్రిటికల్ గా మారిందని.. దాదాపు 45 నిమిషాల పాటు ఆయనకు పల్స్ అందలేదని .. మళ్లీ ఆయనను యధావిధిస్థితికి తీసుకోరాడానికి.. డాక్టర్ చాలా కష్టపడ్డారని తెలుస్తుంది . అయితే నిజానికి షెడ్యూల్ ప్రకారం తారకరత్న ఈ పాదయాత్రలో పాల్గొనకూడదు .. 48 గంటలు ముందే ఆయన ఈ షెడ్యూల్ ని పెట్టుకున్నారు . ఈలోపే ఇలా జరగడం ఏపీ పాలిటిక్స్ లోనే సంచలనంగా మారింది.
దీంతో కావాలనే కొందరు ఆయనంటే గిట్టని వాళ్ళు ఇలా ఆయనపై విష ప్రయోగం చేశారని సోషల్ మీడియాలో టిడిపి తమ్ముళ్లు చెప్పుకొస్తున్నారు . ఏది ఏమైనా సరే లోకేష్ యాత్ర ప్రారంభించిన రోజే ఇలా తారకరత్న పై విషప్రయోగం జరగడం ఏపీ రాజకీయాల్లోని సంచలనంగా మారింది . ఎవరో దగ్గర వాళ్ళే ఇలా పక్కా ప్లాన్ తో స్కెచ్ వేసి మరి తారకరత్న పై విష ప్రయోగం చేశారన్నది టిడిపి తమ్ముళ్ల వాదన దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది..!!