నందమూరి తారకరత్న ఆరోగ్యం అత్యంత విషయంగా ఉందని డాక్టర్లు ప్రకటించారు . లోకేష్ యువగళం పేరిట పాదయాత్ర ప్రారంభించిన విషయం తెలిసిందే. పాదయాత్రలో భాగంగా పాల్గొన్న తారకరత్న కు అక్కడే హార్ట్ అటాక్ వచ్చింది. ఆయనను వెంటనే హుటాహుటిన కుప్పంలోని సమీప ఆసుపత్రికి తరలించారు . పరిస్థ్దితి కంట్రోల్ తప్పడంతో..అక్కడి నుంచి సరాసరిగా బెంగళూరు కి తరలించారు .
ఈ క్రమంలోనే నిన్న సాయంత్రం వరకు ఆరోగ్యం నిలకడగా ఉందన్న వైద్యులు ఒకసారిగా ఆయన ఆరోగ్యం మరింత క్షీణించిందని ప్రకటించారు. దీంతో నందమూరి అభిమానులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు . కాగా కొద్దిసేపటి క్రితమే తారకరత్న ఆరోగ్యం మరింత క్షీణించిందని ఆయన మెలెనా అనే అరుదైన వ్యాధి ఉన్నట్లు డాక్టర్లు చెప్పుకొస్తున్నారు .
ఈ క్రమంలోని చిన్న ప్రేగులో రక్తస్రావం జరుగుతుందని ..ఈ వ్యాధి లక్షణాలున్న వ్యక్తి అకస్మాత్తుగా కుప్పకూలిపోయే అవకాశం ఉంటుందని డాక్టర్స్ చెప్పుకొస్తున్నారు. కాగా ఇదే క్రమంలో నందమూరి కుటుంబ సభ్యులందరూ హుటాహుటిన బెంగుళూరుకి బయలుదేరారు . ఇప్పటికే బాలకృష్ణ, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ అందరూ ఆయనను దగ్గరుండి చూసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నందమూరి హీరోలు ఎన్టీఆర్ , కళ్యాణ్‌రామ్ కూడా అక్కడికి ప్రత్యేక విమానంలో బెంగళూరులోని నారాయణ హార్ట్ హాస్పిటల్ కి చేరుకోబోతున్నారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది..!!