నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా 2021 డిసెంబర్ 2న రిలీజ్ అయిన అఖండ బాలయ్య కెరీర్‌లోనే ఆల్ టైం బ్లాక్‌బస్టర్ హిట్ సినిమాగా నిలిచింది. అఖండకు ముందు బాలయ్య నటించిన మూడు సినిమాలు పెద్ద ప్లాప్ అయ్యాయి. అసలు రూలర్ సినిమాను జనాలు ఎవ్వరూ పట్టించుకోలేదు. ఆ తర్వాత కరోనా అడ్డంకులు దాటుకుని ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన అఖండ ఓ వైపు కరోనా కష్టాలను, ఇటు టిక్కెట్ రేట్ల అడ్డంకులు దాటుకుని సూపర్ హిట్ అయ్యింది.
అఖండ 110 కేంద్రాల్లో 50 రోజులు ఆడగా… డైరెక్టుగా 4 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. అసలు తెలుగు నాట డైరెక్ట్ 100 రోజుల సినిమాలను జనాలు మర్చిపోతోన్న టైంలో అఖండ నాలుగు కేంద్రాల్లో డైరెక్టుగా సెంచరీ కొట్టడం సెన్షేషనల్ అయ్యింది. అఖండతో బాలయ్య దమ్మేంటో మరోసారి ఫ్రూవ్ అయ్యింది. ద్వారక క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు బోయపాటి శ్రీను దర్శకుడు.
సినిమా విజయంలో బాలయ్య అఘోరా క్యారెక్టర్, థమన్ మ్యూజిక్.. బోయపాటి టేకింగ్, డైలాగులు హైలెట్ అయ్యాయి. ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా ప్రగ్య జైశ్వాల్ హీరోయిన్‌గా నటించింది. బాలయ్య – బోయపాటి కాంబినేషన్ హ్యాట్రిక్ కొట్టింది. ఇదిలా ఉంటే ఈ సినిమాను తాజాగా బాలీవుడ్‌లో రిలీజ్ చేశారు. నిన్న అంటే 20వ తేదీన బాలీవుడ్‌లో అఖండ హిందీ వెర్షన్ రిలీజ్ అయ్యింది.
సినిమాపై కాన్ఫిడెన్స్‌తో పెన్ స్టూడియోస్ వారు భారీగా ఈ సినిమాను బాలీవుడ్ థియేటర్లలో రిలీజ్ చేశారు. నార్త్‌లో కూడా పలు స్టేట్స్‌లో అఖండ హిందీ వెర్షన్ రిలీజ్ అయ్యి మంచి టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా మాస్ జనాలకు సినిమా బాగా నచ్చేసిందన్న టాక్ ఫస్ట్ రోజే వచ్చేసింది. అక్కడ బీ, సీ సెంటర్ల ప్రేక్షకులు, మాస్ మూవీ లవర్స్ మన ఊరమాస్ సినిమాలను బాగా ఇష్టపడతారు.
అఖండ కూడా ఈ జనాలకు బాగా ఎక్కేసిందట. ఇక నార్త్‌లో హైందవ సంస్కృతికి ఇంపార్టెన్స్ ఎక్కువ. ఈ క్రమంలోనే అఖండలో ఉన్న హిందూత్వ నినాదం కూడా వాళ్లకు బాగా నచ్చడంతో సినిమాకు ఫస్ట్ డే మంచి టాక్ అయితే వచ్చేసింది. ఇక ఈ సంక్రాంతికి ఇప్పటికే వీరసింహారెడ్డితో హిట్ కొట్టిన బాలయ్య.. ఇప్పుడు అఖండ హిందీ వెర్షన్‌తో మరో హిట్ తన ఖాతాలో వేసుకుని డబుల్ ధమాకా ఇచ్చేశాడు.