Moviesషాకింగ్ ట్వీస్ట్: రాహుల్ తో ఆషూ రెడ్డి పెళ్లి..ఇక అదొక్కటే ...

షాకింగ్ ట్వీస్ట్: రాహుల్ తో ఆషూ రెడ్డి పెళ్లి..ఇక అదొక్కటే మిగిలింది బాసూ..!!

ఆషూ రెడ్డి ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు . సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనదైన స్టైల్ లో పలు కవర్ సాంగ్స్ చేసి హ్యూజ్ క్రేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది . మరీ ముఖ్యంగా జూనియర్ సమంత గా పాపులారిటీ దక్కించుకున్న ఆషూ రెడ్డి బిగ్ బాస్ లోకి అడుగుపెట్టిన తర్వాత తన స్టైల్ ను క్రేజ్ ను రేంజ్ను డబుల్ కాదు ట్రిపుల్ రేంజ్ లో పెంచేసుకుంది . మరీ ముఖ్యంగా హౌస్ లో రాహుల్ తో తో చేసిన సందడి అంతా ఇంతా కాదు . అయితే బిగ్ బాస్ నుండి బయటకు వచ్చిన తర్వాత ఆషూ రెడ్డి ..రాహుల్ మంచి ఫ్రెండ్స్ అయిపోయారు .

ఎంతలా అంటే ఏ పార్టీ చేసుకున్న ఆషూ రెడ్డి – రాహుల్ సిప్లగంజ్ జంట పక్షులలో అక్కడ కనిపించడం మొదలైంది . ఈ క్రమంలోనే ఒకానొక టైం లో ఆశురెడ్డి – రాహుల్ ని పెళ్లి చేసుకోబోతుంది అంటూ ఓ రేంజ్ లో వార్తలు వినిపించాయి . అయితే దీనిపై వాళ్లు ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఫ్రెండ్స్ అంటూ చెప్పుకొస్తున్నా.. వాళ్ళు బిహేవ్ చేసే పద్ధతి చూస్తుంటే.. కచ్చితంగా ఈ జంట త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పబోతుంది అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు . ఈ క్రమంలోనే రీసెంట్గా రాహుల్ పాడిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాట గోల్డెన్ గ్లోబల్ అవార్డు దక్కించుకున్న శుభ సందర్భంగా ఆషూ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలిపారు.

ఆర్ఆర్ఆర్ మూవీ గోల్డెన్ గ్లోబల్ అవార్డు గెలుచుకున్న విషయం తెలిసిందే . ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు ఈ ప్రతిష్టాత్మక అవార్డుకి ఎంపికైంది.. సాంగ్ కంపోజర్ కీరవాణి అవార్డును అందుకున్నారు . ఈ మూమెంట్లో రాహుల్ సిప్లిగంజ్ పేరు ప్రపంచ సినిమా వేదికపై వినిపించడం అభిమానులకు ఫుల్ జోష్ ని ఇచ్చింది. గల్లీబాయ్ రాహుల్ అత్యున్నత గౌరవం అందుకున్నాడని పలువురు ప్రశంసిస్తున్నారు . ఈ క్రమంలోని ఆషూ రెడ్డి.. అతగాడిని హగ్ చేసుకుని మరీ కంగ్రాట్స్ చెబుతూ .. ఫోటోని పోస్ట్ చేసింది . వీరిద్దరి మధ్య ఉన్న ఈ చనువు చూస్తుంటే ఖచ్చితంగా వీళ్ళు పెళ్లి చేసుకోబోతున్నారని పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేసుకోవడమే మిగిలింది అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు . ఏమో రానున్న రోజుల్లో ఏం జరగబోతుందో వేచి చూద్దాం..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news