సంక్రాంతి సినిమాల్లో బాలయ్య వీరసింహారెడ్డి సినిమాకే ప్రి రిలీజ్ బజ్ ముందు నుంచి కాస్త ఎక్కువ కనిపిస్తోంది. అయితే ఈ సినిమాకు ఇప్పుడు మరో ప్లస్ యాడ్ అయ్యింది. వీరసింహారెడ్డి జనవరి 12న రిలీజ్ అవుతోంది. ఆ మరుసటి రోజు చిరు వాల్తేరు వీరయ్య ఉంది. 14న యూవీ వాళ్ల కల్యాణం కమనీయం సినిమాలు ఉన్నాయి. ఈ పోటీలో దిల్ రాజు వారసుడు సినిమా జనవరి 11న రిలీజ్ అనుకున్నారు.
అయితే ఇప్పుడు సడెన్‌గా వారసుడు జనవరి 14కు వెళ్లిపోయింది. విచిత్రంగా తమిళ్‌లో 11న, హిందీలో 13న వస్తుండగా, తెలుగులో మాత్రం 14న వస్తోంది. అంటే తమిళ్‌లో రిలీజ్ అయిన మూడు రోజులకు తెలుగులో వస్తోంది. ఇది ఓ రకంగా నిర్మాత రాజుకు రిస్కే. కారణాలు ఏవైనా తనపై వస్తోన్న విమర్శలకు తెరదించుతూ రాజు పెద్ద షాకింగ్ డెసిషనే తీసుకున్నాడు.
శరవేగంగా మారిన ఈ పరిణామలు అన్నీ కూడా బాలయ్య వీరసింహారెడ్డికి చాలా ప్లస్ అయ్యాయి. ముందుగా అనుకున్నట్టుగా వారసుడు 11న వచ్చి ఉంటే కనీసం 50 శాతం థియేటర్లలోనే బాలయ్య సినిమా రిలీజ్ అవ్వాల్సి వచ్చేది. 11న వారసుడు, అజిత్ తెగింపునకు కొన్ని స్క్రీన్లు పోతాయి. ఇప్పుడు వారసుడు 14కు వెళ్లిపోవడంతో ఏపీ, తెలంగాణలో ఉన్న 90 శాతం స్క్రీన్లలో 12న వీరసింహాకు సోలో రిలీజ్ దక్కనుంది.
ఇది భారీ కౌంట్ అనే చెప్పాలి. టాక్‌తో సంబంధం లేకుండా బాలయ్య సినిమాకు ఫస్ట్ డే ఎక్కువ స్క్రీన్లు దొరుకుతున్నాయి. దీంతో ఫస్ట్ డే మంచి నెంబర్లు నమోదు కానున్నాయి. ఒకవేళ ఫస్ట్ షోకే మంచి టాక్ వస్తే.. ఫస్ట్ డే అంతా వీరసింహా కుమ్ముకోవచ్చు.. సెకండ్ డే కూడా ఎక్కువ స్క్రీన్లు తొలగించలేరు. ఇక వీరయ్య 13న వస్తోంది. వీరసింహా ఆక్రమించుకోగా మిగిలిన థియేటర్లలోనే వీరయ్య వస్తుంది. ఇది ఓ విధంగా చిరు సినిమాకు షాకే.
దీంతో వీరసింహాతో పోలిస్తే వీరయ్యకు ఫస్ట్ డే ఫిగర్లు తక్కువే ఉండొచ్చు. అయితే ఇదంతా ఫస్ట్ డే వరకే. ఆ తర్వాత టాక్‌ను బట్టి థియేటర్లు ఎత్తేయడం.. పెంచడం జరుగుతుంది. రెండో రోజు నుంచి సినిమా కంటెంట్ మాత్రమే మాట్లాడుతుంది. మరి బాలయ్య వీరసింహాగా 12న ఎలా విజృంభిస్తాడో ? చూడాలి.