కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ నటించిన తునివు.. తెలుగులో తెగింపు సినిమా ఈ రోజు వరల్డ్ వైడ్‌గా థియేటర్లలోకి వచ్చింది. ఇప్పటికే తమిళనాడు ప్రీమియర్లు పడడంతో అక్కడ టాక్ హోరెత్తిపోతోంది. అలాగే ఓవర్సీస్‌లోనూ తెగింపు ప్రీమియర్లు పడడంతో టాక్ బయటకు వచ్చేసింది. అక్కడ సినిమా చూసిన ప్రేక్షకులు సినిమా గురించి ఎలాంటి కామెంట్లు పెడుతున్నారు ? టాక్ ఎలా ఉందో చూద్దాం.
సినిమా ఫస్టాఫ్‌లో అజిత్ స్క్రీన్ స్పేస్ తక్కువుగా ఉన్నా ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోయిందట. సెకండాఫ్‌లో విజయ్ డిజాస్టర్ సినిమా బీస్ట్, మహేష్ సర్కారు వారి పాట సినిమాలను గుర్తు చేసిందట. కొందరు డీసెంట్ థ్రిల్లర్, మరి కొందరు మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ అంటున్నారు. సినిమా అంతా బ్యాంక్ మోసాల చుట్టూ తిరుగుతుందని.. ఫస్టాఫ్‌లో అజిత్ మేనియాతో కథ నడిస్తే.. అసలు కథ సెకండాఫ్ నుంచే స్టార్ట్ అవుతుందంటున్నారు.
అజిత్ ఫ్యాన్స్ మాత్రం ఇది బ్లాక్ బస్టర్ అని.. అజిత్ వన్ మ్యాన్ షో అంటూ కీర్తిస్తున్నారు. శంకర్ స్టైల్లో హెచ్ వినోద్ సినిమాను తీస్తే ఎలా ? ఉంటుందో అదే తెగింపు అని.. అదిరిపోయే యాక్షన్ సీన్లు, కళ్లు చెదిరే విజువల్స్‌తో అందరూ మెస్మరైజ్ అయిపోయారంటున్నారు. అయితే సినిమాపై నెగటివ్ కామెంట్లు కూడా వస్తున్నాయి. గత కొంత కాలంగా అజిత్ సినిమాలు చూస్తే అస్సలు కథ కనపడడం లేదు. ఏదో స్టైలీష్ యాక్షన్, ఫైట్లతో లాగించేస్తున్నారు. ఈ సినిమాలోనూ అదే రిపీట్ అయ్యిందంటున్నారు.
దీనికి తోడు సీజీ వర్క్ బాగోలేదని.. కాస్టింగ్ అస్సలు సెట్ కాలేదని.. విజయ్ బీస్ట్ డిజాస్టర్ అయ్యింది.. ఆ సినిమా చూసి కూడా మళ్లీ అదే టైప్ కథను ఎందుకు ఎంచుకున్నారన్న కామెంట్లు పడుతున్నాయి. నేను టిక్కెట్‌కు పెట్టిన డబ్బులన్నీ వేస్ట్ అయ్యాయని ఓ నెటిజన్ కామెంట్ చేస్తున్నాడు. ఓవరాల్‌గా తెగింపుకు మిక్స్ డ్ టాక్ ఎక్కువుగా వినిపిస్తోంది.