మనకు తెలిసిందే .. ముందు నుంచి సమంతకు డైట్ అన్న వర్కౌట్ చేయడం అన్న చాలా ఇష్టం . బాడిని ఫిట్‌గా ఉంచుకోవడానికి పకడ్బందీగా పక్క ప్లాన్ తో ముందుకు వెళుతూ ఉంటుంది సమంత . ఈ క్రమంలోనే ఓవర్ వర్క్ అవుట్స్ చేయడం వల్లే సమంతకు మయోసైటీస్ అనే వ్యాధి వచ్చింది అంటూ డాక్టర్లు సైతం చెప్పుకొచ్చారు . అయితే వ్యాధి తగ్గించుకునేంతవరకు సైలెంట్ గా ఉన్న సమంత.. రీసెంట్గా మళ్లీ తన వర్కౌట్ వీడియోస్ ని స్టార్ట్ చేసింది .
ఇదే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది . సమంత పోస్ట్ చేస్తూ..” కఠిన సమయంలో నాకు చేరువై నాలో స్ఫూర్తిని నింపిన హూ ఇస్ గ్రావిటీ బ్యాంక్ ధన్యవాదాలు . సాధ్యమైనంత వరకు కఠిన తరమైన డైట్ లో మనం తినే ఆహారం వల్ల బలం రాదని .. మన ఆలోచన విధానం పైనే అది ఆధారపడి ఉంటుందని..” పరోక్షకంగా తగలాల్సిన వాళ్ళకి తగిలే విధంగా ఘాటుగా కౌంటర్ వేసింది సమంత.
ఈ క్రమంలోనే మళ్లీ సమంత వర్కౌట్స్ చేయడం పై పలువురు ఫాన్స్ మండిపడుతున్నారు. హెల్తీగా ఉండడం ఇంపార్టెంటే కానీ నీ ఆరోగ్యం బాగా లేనప్పుడు.. నువ్వు వర్కౌట్ చేయడం అవసరమా అంటూ ఫైర్ అవుతున్నారు. మరికొందరు నువ్వు త్వరగా పూర్తి ఆరోగ్యవంతురాలుగా అవ్వాలని కోరుకుంటున్నాం” అంటూ ఆమెకు విషెస్ అందజేస్తున్నారు . దీంతో సమంత పేరు మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది..!!