Moviesవిజయ్ దేవరకొండ లో ఉన్న ఏకైక బ్యాడ్ క్వాలిటీ ఇదే..అది మార్చుకుంటే...

విజయ్ దేవరకొండ లో ఉన్న ఏకైక బ్యాడ్ క్వాలిటీ ఇదే..అది మార్చుకుంటే మరో మెగాస్టారే..!!

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . సినిమా ఇండస్ట్రీ లోకి రావడానికి చాలా కష్టపడ్డ విజయ్ దేవరకొండ.. ఇండస్ట్రీలోకి వచ్చాక కూడా మొదటి హిట్ ఎందుకోవడానికి చాలా ట్రై చేశాడు . అయితే ఎట్టకేలకు పెళ్లిచూపులు అనే సినిమాతో ఫస్ట్ క్లాసిక్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న విజయ్ దేవరకొండ ..ఆ తర్వాత అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లో టాలీవుడ్ ఇండస్ట్రీని ఏలేసే స్టార్ హీరోగా మారిపోయాడు .ఒకే ఒక్క సినిమాతో ఈ రేంజ్ క్రేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరోగా రికార్డ్ నెలకొల్పాడు విజయ్ దేవరకొండ .

అర్జున్ రెడ్డి సినిమాలో ఆయన ఆటిట్యూడ్ , నటన , హెడ్ వెయిట్ చూసిన జనాలు విపరీతంగా నచ్చేసి ఫ్యాన్ అయిపోయారు . ఎంతలా అంటే రౌడీ హీరో విజయ్ దేవరకొండ పేరును ఆయన ఫేస్ బొమ్మను ఏకంగా అమ్మాయిలు తమ ప్రైవేట్ బాడీ పార్ట్స్ పై పచ్చ బొట్టు వేయించుకునే అంత పిచ్చి అభిమానాన్ని పెంచుకునేసారు . కాగా సినిమా ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండకు హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది . బాలీవుడ్ లోనూ హీరోయిన్స్ విజయ్ అంటే పడి చచ్చిపోతారు .. ఆయనతో డేటింగ్ చేయాలని ఎంతో మంది ముద్దుగుమ్మలు వెయిట్ చేస్తున్నారు .

అయితే ఇంతటి క్రేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విజయ్ దేవరకొండకు ఆయన కోపమే ఆయనకు మైనస్ అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు . ఎంతోమంది పేద ప్రజలకు హెల్ప్ చేసే విజయ్ దేవరకొండ తాను చేసిన మంచి పనులను బయటకు చెప్పుకుని డప్పు కొట్టుకునే టైపు కాదు. అంతే కాదు ఎవరేమన్నా సరే అక్కడే ఇచ్చి పడేసే విజయ్ దేవరకొండ ముందు ఒక మాట వెనక ఒక మాట్లాడే తత్వం లేదు. ఉన్నది ఉన్నట్టే మాట్లాడేస్తారు అది కూడా విజయ్ దేవరకొండ కెరియర్ కి నెగిటివ్గా మారింది అంటున్నారు ఆయన ఫ్రెండ్స్ . ఆ ఒక్కటి లేకుండా ఉంటే విజయ్ దేవరకొండ కూడా ఇండస్ట్రీలో మరో మెగాస్టార్ గా రాజ్యమేలేసే టాలెంట్ ఉన్న నటుడు అంటూ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news