నటనతోనే కాకుండా నాట్యంతోనూ చిత్ర చరిత్రలో చెరిగిపోని సంతకాన్ని చేసిన లెజండరీ నటి ఎల్.విజయలక్ష్మి. ఎన్నో ఏళ్ల తర్వాత తెలుగు ప్రేక్షకులను అలరించారు. బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో ఎన్నో మరపురాని చిత్రాల్లో ఆమె పోషించిన అత్యద్భుతమైన పాత్రలు ఇప్పటికీ మరపురాని విధంగా ఉంటాయి. నర్తన శాల సినిమాలో.. ఆమె చేసిన అభినయం.. ఏకంగా జాతీయ అవార్డును తీసుకు వచ్చింది.
నటనతోనే కాకుండా నాట్యంతోనూ చిత్ర చరిత్రలో చెరిగిపోని సంతకాన్ని చేసిన లెజండరీ నటి ఎల్.విజయలక్ష్మి. అలాంటి నటి ఎక్కడా ఎలాంటి రిమార్కులు లేకుండా దూసుకుపోయారు. ముఖ్యంగా అన్నగారు ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు సహకారంతో ఆమె దూకుడుగా ముందుకు సాగారు. ఎంతో సౌమ్యం.. అంతకుమించిన అభినయం రెండూ కలబోసిన విజయలక్ష్మి.
ఆమె అంటే.. ఇద్దరు మహానటులకు ఎంతో ప్రీతి. ఆమె క్యారెక్టర్ నటి అయినప్పటికీ.. ఆమెను అభిమానించే ప్రేక్షకులు కూడా అంతే ఉన్నారు. అప్పట్లో విజయలక్ష్మి డ్యాన్స్ సినిమాలకు పెద్ద ఎస్సర్ట్. ఈ నేపథ్యంలోనే అన్నగారు, అక్కినేని సంయుక్తంగా కలిసి నటించిన చిత్రం.. గుండమ్మకథ. ఈ సినిమాలో మరో ఇద్దరు మహా నటీమణులు ఉన్నారు. సావిత్రి, జమున. అయితే, ఒకరు అమాయక పాత్ర.. మరొకరు మొరటు పాత్రల్లో ఉన్నారు.
మరి సినిమాకు జోష్ ఎక్కడ ? ఇదీ దర్శకుడిని గాబరా పెట్టిన విజయం. దీంతో అన్నగారు చక్కని సలహా ఇచ్చారు. ఈ సినిమాలో పద్మ అనే పాత్రలో నటించిన విజయలక్ష్మితో చక్కని డ్యాన్స్ పెట్టించరూ..! అని విన్నవించారు. ఇంకేముంది.. అన్నగారు చెప్పడం.. చేయకపోవడమా ? వెంటనే.. . అప్పటికప్పుడు కేవలం మ్యూజిక్ మాత్రమే పెట్టి విజయలక్ష్మితో డ్యాన్స్ చేయించారు. ఇదీ.. అన్నగారి దూరదృష్టి.