ఉప్పెన బ్యూటీని ఐటం భామగా మార్చేస్తారా..కెరీర్ నాశనమే..? అవును ఇప్పుడు ఇదే టాక్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది. ఉప్పెన సినిమాకి ముందు కృతిశెట్టి హీరోయిన్ అవకాశాల కోసం ఎంతగా తిరిగిందో చాలామందికి తెలియదట. స్వయంగా తన తల్లిని వెంటపెట్టుకొని చిన్న నుంచి పెద్ద నిర్మాణ సంస్థల చుట్టూ బాగానే తిరిగిందని టాక్ ఉంది. అంతేకాదు, తన కూతురుకి ఒక్క ఛాన్స్ ఇవ్వమని కృతి తల్లి దర్శకనిర్మాతలను అడిగిన సందర్భాలు చాలానే ఉన్నాయట.
అలా అవకాశం కోసం బ్రతిమలాడుకున్న కృతి ఉప్పెన సినిమా తర్వాత మాత్రం నిర్మాతలే డేట్స్ ఇవ్వమని రిక్వెస్ట్ చేసిన సమయం కూడా అతి కొద్దిరోజుల్లోనే వచ్చింది. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించిన ఉప్పెన భారీ హిట్ సాధించడంతో ఈ యంగ్ బ్యూటీ వెనకాల నిర్మాతలు క్యూ కట్టారు. ఆ సినిమాలో ఆమె క్యూట్ లుక్స్‌కు యువత ఫిదా అయిపోయారు.
ఉప్పెనతో వచ్చిన క్రేజ్‌తో వరుసగా ఏడెనిమిది సినిమాలను ఒప్పుకుంది. కెరీర్ ప్రారంభంలో వరుసగా మూడు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. దాంతో ఈ బ్యూటీని లక్కీ లేడీ అనుకున్నారు. స్టార్ హీరోలు సైతం ఆమె తమ సినిమాల్లో సెకండ్ హీరోయిన్గా అయినా ఉండాలని పంతం పట్టారు. కానీ, అమ్మడు కూడా ఊహించకుండా వరుసగా ఫ్లాపులొచ్చాయి. ఈ యేడాది సంక్రాంతికి వచ్చిన బంగార్రాజును వదిలిస్తే తర్వాత వరుస ప్లాపులు పడ్డాయి.
ది వారియర్, మాచర్ల నియోజకవర్గం లాంటి భారీ అంచనాలతో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. దాంతో కృతిశెట్టి గురించి ఆలోచించేవారు ఎక్కువయ్యారు. ముందు వచ్చినంత వేగంగా కృతిశెట్టికి హీరోయిన్ ఛాన్సులు రావడం లేదు. దాంతో కొందరు కావాలనే ఐటెం సాంగ్స్‌కి గెస్ట్ రోల్స్‌కి అడుగుతున్నారట. దీనికి కృతి కూడా ఆసక్తి చూపిస్తున్నట్టు ఇండస్ట్రీ వర్గాలలో టాక్ వినిపిస్తోంది.
అదే జరిగితే, అనిత..రీమాసేన్ లాంటి కుర్ర భామల మాదిరిగానే కృతిశెట్టి కెరీర్ కూడా ఢమాల్ అనే టాక్ ఇప్పుడు బాగా వినిపిస్తోంది. ఇప్పుడు ఆమెకు కాస్తో కూస్తో ఉన్న క్రేజ్‌ను వాడుకుని ఐటెం గర్ల్‌గా మార్చేస్తారు. తర్వాత ఆమెకు హీరోయిన్ అవకాశాలు రావు. అక్కడితో ఆమె కెరీర్ ఢమాల్ అయిపోయినట్టే..! మరి కృతి తన లైఫ్‌ను ఎలా ప్లాన్ చేసుకుంటుందో ? చూడాలి.