కన్నడ ఇండస్ట్రీని షేక్ చేసిన కాంతారా సినిమా గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చాలా సింపుల్ గా రిలీజ్ అయి బాక్సాఫీస్ ని షేక్ చేసింది . ఆ తర్వాత పాన్ ఇండియా లెవెల్ లో డబ్ చేసి అన్ని భాషల్లో కాంతారా వైబ్స్ తీసుకొచ్చాడు రిషిబ్ శెట్టి . కాగా తెలుగులో కూడా కాంతారా సినిమా బిగ్గెస్ట్ సూపర్ బ్లాక్ బస్టర్ హీట్ గా నిలిచిన విషయం తెలిసిందే.
ఈ సినిమాలో రిషిబ్ శెట్టి పర్ఫామెన్స్, నేచురాలిటీ కాన్సెప్ట్..సినిమా సూపర్ హిట్ అవ్వడానికి కారణ మైయాయి. దీంతో చాలా మంది స్టార్స్ స్టార్ట్ డైరెక్టర్ రిషిబ్ శెట్టిని .. కాంతారా సినిమాను పొగిడేస్తూ వచ్చారు. అయితే ఎవ్వరు ఊహించని విధంగా బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనురాగ్ క్యాశప్ రిషిబ్ ని టార్గెట్ చేసి నెగటివ్ కామెంట్స్ చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
“గతంలో సైరత్ సినిమా మరాఠీ పరిశ్రమను నాశనం చేసిందని దర్శకుడు నాగరాజు మంజుల చేసిన వ్యాఖ్యలను మరోసారి తెర పైకి తీసుకొస్తూ ఇలాంటి సినిమాలవల్లే సినిమా ఇండస్ట్రీ నాశనం అవుతుందని ” చెప్పుకొచ్చాడు. దీంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో కాంతారా సినిమాపై చర్చలు జోరుగా నడుస్తుంది. అస్సలు ఈ సినిమా దేనికి పనికి వస్తుంది..? సినిమా హిట్ అవ్వడానికి మెయిన్ కారణం ఏంటి ..? ఈ సినిమాలో మెసేజ్ ఏముంది ..? ఇంతలా జనాలు ఈ సినిమాను ఆదరించడానికి ఈ సినిమాలో ఏముంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు . ఏది ఏమైనా సరే పాన్ ఇండియా కల్చర్ వల్లే బాలీవుడ్ ఇండస్ట్రీ ఇలా కుదేలు అయింది అని చెప్పుకో రావడం సంచలనంగా మారింది.