కన్నడ కస్తూరి రష్మిక మందన్న ఎంత తక్కువ టైంలో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిందో.. అంతే తక్కువ టైంలో ఆమె చుట్టూ అనేక వివాదాలు ముసురుకుంటున్నాయి. రష్మిక కన్నడంలో ముందుగా కిరాక్ పార్టీ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో ఆమెకు మంచి పేరు వచ్చింది. ఆ సినిమాలో హీరోగా చేసిన రక్షిత్ శెట్టితో ఆమె ప్రేమలో పడటం.. వీరిద్దరి పెళ్లి కోసం ఎంగేజ్మెంట్ జరగటం చకచకా జరిగిపోయాయి. మధ్యలో కరోనా వచ్చింది.. పెళ్లి కాస్త వాయిదా పడింది.
ఈ టైంలో ఆమె తెలుగులో ఛలో ఆ తర్వాత నితిన్‌తో భీష్మ సినిమాల్లో నటించింది. ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. అక్కడి నుంచి తెలుగులో వరుస పెట్టి స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్సులు వచ్చాయి. అక్కడి నుంచి బాలీవుడ్ లోనూ అవకాశాలు వచ్చాయి. ఇటు తమిళంలోనూ ఇప్పుడు విజయ్ లాంటి స్టార్ హీరోకు జోడిగా వారసుడు సినిమాలో నటిస్తోంది. తెలుగులో ఎప్పుడు అయితే ఛలో సినిమాలో ఎంటర్ అయిందో అప్పటి నుంచి రష్మిక వెనక్కు తిరిగి చూసుకోవలసిన అవసరం లేకుండా పోయింది.
వరుసగా ఛాన్సులు వస్తుండడంతో ఆమె రక్షిత్ శెట్టితో చేసుకున్న ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకుంది. కెరీర్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలన్న ఉద్దేశంతో ఆమె ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకుని ఉండొచ్చు. కోట్ల రూపాయల రెమ్యూనరేషన్లతో అవకాశాలు తలుపులు తడుతుంటే ఆమె మాత్రం ఎందుకు ? పెళ్లి చేసుకుంటుంది. ఎప్పుడు అయితే ఆమె ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకుందో కన్నడ సినీ విమర్శకులు.. మేధావులు, సోషల్ మీడియాలో హల్చల్ చేసే వాళ్లంతా ఆమెపై రెచ్చిపోయారు.
కన్నడ సినిమా పరిశ్రమ అవతల రష్మిక క్రేజ్ తెచ్చుకోవటం కన్నడీగులకు మంటగా మారింది. ఆమె స్టార్ హీరోయిన్ అయ్యాక కన్నడ సినిమాల్లో నటించడం మానేసింది. దీనికి కూడా చాలా కారణాలు ఉన్నాయి. కనడంలో రెమ్యూనరేషన్ చాలా తక్కువ. అక్కడ ఎన్ని సినిమాల్లో నటించినా వచ్చే క్రేజ్ కూడా తక్కువగానే ఉంటుంది. ఇప్పుడు రష్మిక తెలుగు – తమిళ్ – హిందీలో స్టార్ హీరోయిన్ అయిపోయింది. అందుకే కన్నడంలో నటించే సమయం ఆమెకు లేదు. ఇది కూడా కన్నడీగలకు నచ్చటం లేదు.
దీంతో కన్నడంలో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్లు, కొందరు హీరోల అభిమానులు ఇప్పుడు రష్మిక పేరు చెబితేనే మండిపడుతున్నారు. తమ కన్నడ అమ్మాయి అయి ఉండి కన్నడం బయట స్టార్ హీరోయిన్గా ఉండటం వాళ్లకు ఏమాత్రం నచ్చటం లేదు. దీనికి తోడు కాంతారా సినిమా విషయంలో ఆ సినిమా విజయానికి.. రష్మికకు ముడిపెడుతూ కొందరు తీవ్రమైన కామెంట్లు చేశారు. కాంతారా సినిమా తాను చూడలేదని రష్మిక అన్నట్టు వార్తలు రావడం.. దీంతో కన్నడ సినిమా ఇండస్ట్రీ రష్మికను బ్యాన్ చేసే స్థాయికి వచ్చేసిందన్న వార్తలు రావడం.. చివరకు రష్మిక వాటిని ఖండించడం వరకు జరిగిపోయాయి.
అయితే అదే సమయంలో మరో కన్నడ అమ్మాయి పూజా హెగ్డే ( హెగ్డే అన్న పేరు ఉంటే చాలు ఆమె కన్నడ అమ్మాయి అని వాళ్లు ఓన్ చేసేసుకుంటారు) ముంబైలో పెరిగినా ఆమె కాంతారా సినిమా బాగుందని చెప్పడంతో ఆమెను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. అయితే పూజా కూడా ఎప్పుడు కన్నడ ఇండస్ట్రీపై ప్రేమ చూపలేదు. అందుకే ఆమెను వ్యతిరేకించే వాళ్లు కూడా కాంతారా హిట్ అయ్యాకే పూజకు కాంతారా గుర్తుకు వచ్చిందా ? అని విమర్శిస్తున్నారు. ఓవరాల్‌గా మాత్రం రష్మిక వ్యతిరేకులు ఎక్కువవ్వడంతో పూజ ముద్దు రష్మిక వద్దన్న స్లోగన్ అందుకున్నారు.