Moviesవీర‌సింహారెడ్డి Vs వాల్తేరు వీర‌య్య థియేట‌ర్ల పంచాయితీలో కొత్త మ‌లుపు...!

వీర‌సింహారెడ్డి Vs వాల్తేరు వీర‌య్య థియేట‌ర్ల పంచాయితీలో కొత్త మ‌లుపు…!

టాలీవుడ్ లో సంక్రాంతికి పోటీపడుతున్న రెండు పెద్ద సినిమాలకు థియేటర్లు కేటాయించే విషయంలో ఇంకా చాలా చోట్ల పంచాయితీలు నడుస్తూనే ఉన్నాయి. బాలకృష్ణ వీరసింహారెడ్డి – చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాలతో పాటు దిల్ రాజు నిర్మిస్తున్న బైలింగ్వల్ మూవీ విజయ్ వారసుడు సినిమా కూడా సంక్రాంతికి రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. వారసుడు – వీర సింహారెడ్డి రెండు సినిమాలు జనవరి 12న థియేటర్లలోకి వస్తున్నాయి. చిరంజీవి వాల్తేరు వీరయ్య జనవరి 13న రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే.

వార‌సుడు రాజు సొంత సినిమా కావ‌డం.. థియేట‌ర్ల గుత్తాధిప‌త్యంలో రాజు చ‌క్రం తిప్పుతుండ‌డంతో ఆ సినిమాకు ఎక్కువ థియేట‌ర్ల‌తో పాటు మంచి థియేటర్లు అన్నీ వెళ్లిపోతున్నాయ‌ట‌. ముఖ్యంగా నైజాంలో సురేష్‌బాబు, అల్లు అర‌వింద్‌తో పాటు ఏసియ‌న్ సునీల్ చేతుల్లో ఉన్న మంచి థియేట‌ర్లు కూడా వార‌సుడికే వెళుతున్నాయంటున్నారు. ఇక లేటెస్ట్‌గా ఆసియ‌న్ సంస్థ ఓ 50 థియేట‌ర్ల లిస్ట్‌ను వాల్తేర్ వీరయ్య, వీరసింహారెడ్డి డిస్ట్రిబ్యూటర్ శశికి పంపించి.. అందులోనుంచి న‌చ్చిన వాటిని ఎంపిక చేసుకోమ‌ని ఆప్ష‌న్ ఇచ్చింద‌ట‌.

అయితే డిస్ట్రిబ్యూట‌ర్ వెర్ష‌న్ మ‌రోలా ఉంద‌ట‌. మాకు కావాల్సిన థియేట‌ర్లు మేం అడుగుతాం అంటున్నార‌ట‌. ఏసియ‌న్ వాళ్లు మాత్రం మా ద‌గ్గ‌ర ఉన్న థియేట‌ర్ల లిస్ట్ ఇచ్చాం.. అందులో మీకు న‌చ్చిన‌వి ఎంపిక చేసుకోమ‌నం త‌ప్పా ? అన్న ప్ర‌శ్న‌లు వ‌స్తున్న‌ట్టు టాక్ ? అంటే ఏసియ‌న్ వాళ్ల చేతుల్లో ఉన్న టాప్ థియేట‌ర్లు అన్నీ రాజు వార‌సుడు సినిమాకు వెళ్లిపోయాయి. ఇక మిగిలిన థియేట‌ర్లలో మాత్ర‌మే ఇప్పుడు చిరు, బాల‌య్య సినిమాలు స‌ర్దుకోవాల్సి ఉంటుంది.

ఇక చిరు, బాల‌య్య సినిమాల‌కు ఇచ్చిన కొన్ని థియేట‌ర్ల విష‌యంలోనూ రెంట్ కాకుండా.. షేర్ ఇవ్వాల‌న్న డిమాండ్లు వినిపిస్తున్నాయ‌ట‌. థియేట‌ర్ల రెన్నోవేష‌న్ కోసం ఎక్కువ ఖ‌ర్చు పెట్టాం.. అందుకే షేరింగ్ కావాల‌ని అడుగుతున్నార‌ట‌. పెద్ద సినిమాలు…అందులోనూ ఫ‌స్ట్ వీక్ షేర్ ఎలా ఇస్తాం అని డిస్ట్రిబ్యూట‌ర్ శ‌శి అంటున్నాడ‌ట‌. ఎలా అయినా నైజాంలో చిరు, బాల‌య్య సినిమాల‌కు కావాల్సిన‌న్ని ఇబ్బందులు ఎదుర‌య్యేలా ప‌రిస్థితులు క్రియేట్ చేస్తున్నార‌న్న గుస‌గుస‌లు అయితే వినిపిస్తున్నాయి.

నైజాంలో 600 స్క్రీన్లు ఉన్నాయి. మూడు పెద్ద సినిమాలు, ఓ చిన్న సినిమా రిలీజ్ అవుతున్నాయి. చిన్న సినిమాను ప‌క్క‌న పెట్టినా మిగిలిన మూడు పెద్ద సినిమాల‌కు త‌లా 200 థియేట‌ర్లు ఇవ్వ‌వ‌చ్చు. కానీ ఇక్క‌డ వార‌సుడికే స‌గం స్క్రీన్లు వెళ‌తాయని అంటున్నారు. అదే జ‌రిగితే చిరు, బాల‌య్య సినిమాల‌కు 150 థియేట‌ర్లు కూడా దొరికే ప‌రిస్థితి లేదు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news