నందమూరి నట సింహం బాలయ్య ఫస్ట్ టైం హోస్టుగా చేస్తున్న అన్ స్టాపబుల్ షో ఏ రేంజ్ లో దూసుకుపోయిందో మనందరికీ తెలిసిందే. కాగా ఫస్ట్ సీజన్ సూపర్ హిట్ అవడంతో సెకండ్ సీజన్ ప్రారంభించిన ఆహా ..రీసెంట్గా హీరో ప్రభాస్ ని గెస్ట్ గా పిలిచారు . అంతేనా ఆయనతో పాటు తన ఫ్రెండ్ గోపీచంద్ ని పిలిపించారు, ఒక హీరో ఉంటేనే బాలయ్యతో తట్టుకోవడం కష్టం ..మరి ఇద్దరూ బిగ్ హీరోలు బాలయ్య ముందు కూర్చుంటే బాలయ్య ఆగుతారా నో వే.. రచ్చ రచ్చే.
వయసును మర్చిపోయి మరి ఎంజాయ్ చేసిన ప్రోమో మనం సోషల్ మీడియాలో చూడొచ్చు. కాగా ఈ ప్రోమోలో మనం బాగా గమనించినట్లయితే ప్రభాస్ తన పెళ్లి గురించి ఎక్కడ మాట్లాడలేదు. ఆఫ్ కోర్స్ బాలయ్య తనంతట తానే లీడ్ తీసుకొని “మొన్న ఈ షో కి శర్వానంద్ వచ్చాడు. పెళ్లెప్పుడు అంటే ప్రభాస్ తర్వాత అన్నాడు . మరి నిన్ను పెళ్ళెప్పుడు అని అడుగుతున్నాను. అంటే సార్ నేను సల్మాన్ ఖాన్ తర్వాత అనాలి ఏమో అంటూ “చెప్పుకొచ్చాడు.
అంతేకాదు రామ్ చరణ్ కి కాల్ చేసినప్పుడు ..గోపీచంద్ వచ్చినప్పుడు అమ్మాయిలు గురించి ప్రస్తావన వచ్చిన సరే డార్లింగ్ ఏం మాత్రం తన పెళ్లి విషయాని ప్రోలాంగ్ చేయలేదు . మరీ ముఖ్యంగా ఒక ఫోటో చూసి సీన్ కట్ చేసినప్పుడు సార్ మా అమ్మ టెన్షన్ పడిపోతుంది ..సోషల్ మీడియాతో నేను వేగలేను దయచేసి చెప్పండి అంటూ చెప్పుకొచ్చాడు. అంటే ఈ ఉద్దేశం ప్రకారం ప్రభాస్ ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదు అనేగా.. అలాంటిది ఏదైనా ఉంటే ప్రభాస్ బాలయ్య కు చెప్పేవాడు కదా అంటూ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు అంతేకాదు ఈ షోలో అయినా ప్రభాస్ తన పెళ్లి గురించి అఫీషియల్ ప్రకటన చేస్తాడు అనుకున్న ఫ్యాన్స్ ని హర్ట్ చేసాడు.