దివ్య భారతికి..ఒకప్పుడు అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలను ఒక ఊపు ఊపేసిన క్రేజీ హీరోయిన్. ఇప్పటికీ దివ్య భారతీ చేసిన సాంగ్స్ బాగా యూట్యూబ్‌లో వీక్షిస్తూనే ఉన్నారు. అందాల ఆరబోసే పాత్రల్లో అయినా, ఫ్యామిలీ చిత్రాలలో పాత్రలైనా దివ్య భారతీ అద్భుతంగా నటించి ఆకట్టుకుంది. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, మోహన్ బాబు లాంటి స్టార్స్‌తో నటించింది.
తెలుగులో దివ్య భారతి నటించిన బొబ్బిలి రాజా, రౌడీ అల్లుడు, అసెంబ్లీ రౌడీ ఎంతటి ఘన విజయాలను అందుకున్నాయో ఆ సినిమాలతో దివ్య భారతికి వచ్చిన పేరు, క్రేజ్ ఏపాటిదో అందరికీ తెలిసిందే. అయితే, హీరోయిన్స్ చాలామందికి మద్యం, ధూమపానం అలవాటు ఉంటుంది. నార్త్ నుంచి వచ్చిన హీరోయిన్‌కి ఇది తప్పనిసరిగా ఉండే అలవాటు.
దివ్య భారతికి ఇలాగే సిగరెట్, మందు బాగా అలవాటు ఉండేదట. ఇది కొత్త విషయం కాదు..అలాగే వింత విషయం ఏమీ కాదు. కానీ, తాగి కెమెరా ముందు నటించడం అంటే మాత్రం కాస్త వింత విషయమే. హీరోలు కూడా చాలా డిసిప్లేన్‌గా మొహానికి రంగేసుకొని నటిస్తారు. ఏడుపు సన్నివేశాలలో పర్ఫెక్షన్ కోస కళ్ళలో గ్లిజరిన్ వేసుకొని నటిస్తారనే విష్యయం తెలిసిందే. కానీ, దివ్య భారతి మాత్రం ఓ పెగ్గు పడితేనే నటించే సత్తా, ఉత్సాహం వస్తుందని అప్పట్లో చెప్పుకునేవారు.
ఇక షాట్ గ్యాప్‌లో ఖచ్చితంగా చేతిలో సిగరెట్ ఉండేదని చుట్టూ యూనిట్ సభ్యులున్నా రెండు వేళ్ళ మధ్య సిగరెట్ పట్టుకొని దమ్ము కొట్టేదని ప్రచారం జరిగింది. మందు అలవాటు వల్ల షూటింగ్ సమయంలో అది పడితేనే అద్భుతంగా నటించగలిగేదని ..ఇలాంటి వ్యసనాల వల్ల తన కెరీర్ అర్థాంతరంగా ముగిసిందని మాట్లాడుకున్నారు. ఏదేమైనా దివ్య భారతి లాంటి అద్భుతమైన నటిని కోల్పోవడం ఇండస్ట్రీకి, అభిమానులకి పెద్ద లోటు అని చెప్పాలి.