సాధారణంగా మనిషి అన్నాక అప్ అండ్ డౌన్స్ ఉంటాయి . ఎప్పుడు సంతోషాలే ఉండవు ..అప్పుడప్పుడు బాధలు ఉంటాయి. కేవలం సామాన్య జనాలకే కాదు ..స్టార్ సెలబ్రిటీస్ కి కూడా ఇలాంటి ఒడిదుడుకులు ఎదురవుతూనే ఉంటాయి . రీసెంట్గా తన లైఫ్‌లో ఎదుర్కున్న ప్రాబ్లమ్స్ గురించి పాన్ ఇండియా హీరో ప్రభాస్ బాలయ్య అన్ స్టాపబుల్ షోలో ఓపెన్ అప్ అయ్యాడు. మనకు తెలిసిందే ఇంటర్వ్యూలు అంటేనే మొహమాటపడి సిగ్గుపడే ప్రభాస్ పలు ఈవెంట్స్ లో కూడా అస్సలకి మాట్లాడడు.
తన సినిమా గురించి చెప్పుకొని ప్రమోట్ చేస్తాడే తప్పిస్తే ..పక్క విషయాలలో ఎంటర్ అవ్వడు . అలాంటి ఓ హీరో బాలయ్య లాంటి ఎనర్జిటిక్ టాక్ షో కి వస్తే ఎలా ఉంటుంది ..భీభత్సంగా రచ్చ రచ్చఅయిపోతుంది. అయితే బాలయ్య తన స్థాయి శక్తుల ప్రభాస్ దగ్గర మాట్లాడించడానికి ట్రై చేశాడు . ఈ క్రమంలోనే ప్రభాస్ తాను అప్పుల్లో కూరుకుపోయానని ..ఆ టైంలోనే రాజమౌళి సినిమాకు కమిట్ అయ్యానని ..అయితే ఎలాగో రాజమౌళి సినిమా లేటుగా తీస్తాడు కదా..
ఈ లోపే నాకు రెండు ఆఫర్లు వస్తే ..అప్పులో కూరుకుపోయాను.. డబ్బులు చాలా టైట్‌గా ఉంది.. ఆ రెండు సినిమాలు చేస్తాను.. ఆ తర్వాత బాహుబలికి కమిట్ అవుతానని.. ఆయన దగ్గర పర్మిషన్ తీసుకున్నానని ..అప్పుడే రాజమౌళి మనోడు ఎలాగో లేట్ ఏ కదా.. కానీ కానీ అంటూ నన్ను ఎంకరేజ్ చేసాడని.. అని ఆ టైంలో మొదట రెబల్ లో అంటించాను.
ఇక అది అనుకున్నంత హిట్ అవ్వలెదౌ..ఆ తర్వాత కొరటాల శివ తో తన స్నేహితులు వంశీ, ప్రమోద్ నిర్మాతలు కావాలని ప్రయత్నిస్తున్నారు. సొంతంగా బ్యానర్ ఉంటే బావుంటుందనిపించింది. దీనితో యువీ క్రియేషన్స్ ప్రారంభించి అందులోనే మిర్చి చేశాం. మిర్చి పెద్ద హిట్ అయింది అని ప్రభాస్ గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత ప్రశాంతంగా టైం తీసుకుని మరి బాహుబలి చేశాను అని చెప్పుకొచ్చాడు. అంతేకాదు చత్రపతి సినిమాతో రాజమౌళి గురించి నీకు అర్థమయ్యే ఉంటుంది..
అయినా మళ్ళీ బాహుబలి తో ఎందుకు అంత సావాసం చేసావు అని అడగ్గా ..బాహుబలి లాంటి సినిమా కెరియర్ లో మళ్ళీ మళ్ళీ రాదు అన్న సంగతి నాకు తెలుసు ..అందుకే అలాంటి సినిమా కోసం ఐదేళ్లు టైం తీసుకున్నాను అంటూ చెప్పుకొచ్చాడు . దీంతో ఒక్కసారిగా సోలో విజిల్స్ చప్పట్లు జై బాహుబలి అంటూ అరుపులు కేకలు వినిపించాయి.